Begin typing your search above and press return to search.
రమ్య మాట మరీ ఇంత ముదురా?
By: Tupaki Desk | 29 Nov 2016 4:05 AM GMTసినిమా హీరోయిన్లు రాజకీయనేతలుగా మారటం కొత్తేం కాకున్నా.. కన్నడ బ్యూటీ రమ్య వ్యవహారం మాత్రం మిగిలిన వారికి భిన్నంగా కనిపిస్తుంటుంది. తరచూ ఏదో ఒక వివాదంతో చెట్టాపట్టాలేసుకునే ఆమె మాట కాస్త కరుకే. ఇక.. ఆమె వ్యవహారశైలి పై కూడా పలువురు తప్పు పడుతుంటారు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. పదవిలో ఉంటే ఒకలా.. పదవి పోతే మరోలా వ్యవహరించటం ఏమిటన్న మాటతో పాటు.. ఓపిగ్గా సమాధానం చెప్పే అలవాటు లేకపోతే ఎలా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యూపీఏ హయాంలో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన రమ్య.. సార్వత్రి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే.. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటికి పరిష్కారాలు చూపిస్తూ థీసిస్ రాసిన వారికి బహుమతిని ఆమె ప్రకటించారు. ఆమె మాటతో కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన 117 మంది యువకులు స్పందించి.. తమ ఆలోచనల్ని థీసిస్ రూపంలో అందజేశారు.
వాటిల్లో అత్యుత్తమైన థీసిస్ ను ఎంపిక చేసే సమయానికి ఆమె పదవి పోవటంతో.. ఇక ఆ విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. ఎంపీగా ఉన్న సమయంలో ఆమె చెప్పిన మాటలకు స్ఫూర్తి పొంది థీసిస్ రాసిన వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే.. అందులోకొందరు మాత్రం తాము ఇచ్చిన థీసిస్ లో బాగున్నదేదో చెబితే బాగుంటుంది కదా అన్న ఆశతో ఉన్న వారున్నారు.
తాజాగా ఆమె మండ్య జిల్లా కలెక్టరేట్ కు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న చిక్కమరళి గ్రామానికి చెందిన పాండుదురై అనే కుర్రాడు మాజీ ఎంపీని చూడటానికి వచ్చారు. గతంలో అతగాడు రమ్య మాటలకు స్పందించిన థీసిస్ సబ్ మిట్ చేశారు. తాము ఇచ్చిన థీసిస్ లను ఏం చేశారని ప్రశ్నించటంతో పాటు.. అందులో అత్యుత్తమైన దానికి ఇస్తానన్న రూ.2.5లక్షల బహుమతి గురించి ప్రశ్నించారు.
ఇలా అడగటం రమ్యకు నచ్చలేదు. తానిప్పుడు ఎంపీని కాదని.. ఆ విషయాన్ని ఆ ప్రాంత ఎంపీని కానీ.. జిల్లా కలెక్టర్ ను కానీ అడగాలని దురుసుగా సమాధానం చెప్పటంతో.. ఆ కుర్రాడు కాస్త ఫైర్ అయ్యాడు. దీంతో.. మండిపడిన రమ్య.. నువ్వు రౌడీలా మాట్లాడుతున్నావంటూ మండిపడటం.. ఆమె మద్దతుదారులు పాండుదురైపై చేయి చేసుకున్నారు. ఈ సీన్ అంతా చూసిన అక్కడి స్థానికులు మాజీ ఎంపీ మద్దతుదారుల నుంచి ఆ కుర్రాడ్ని రక్షించి.. వారి తీరును తప్పు పట్టారు. అదే సమయంలో ఆ కుర్రాడి వైఖరి సరిగా లేదని అతడికి చెప్పారు. ఏమైనా రాజకీయ నాయకులకు ఉండాల్సిన సహనం రమ్యకు లేదని.. పదవి లేకున్నా.. పవర్ చేతిలో లేకున్నా.. ఆమె తీరు సరిగా లేదని ఈ ఇష్యూపై పలువురు గుస్సా అవుతున్నారు. పదవిలో ఉండే ఒకలా.. పదవిలో లేకుండా మరోలా ఉండటం సరికాదని.. తన తీరును మార్చుకుంటే మంచిదని రమ్యకు పలువురు సూచిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/