Begin typing your search above and press return to search.
ఆయన చనిపోతే.. ఆమె ఎక్కడ?
By: Tupaki Desk | 26 Nov 2018 11:07 AM GMTతమకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన వాళ్లను.. ఒక స్థాయికి తీసుకొచ్చిన వాళ్లను మరిచిపోతే అంతకంటే పాపం మరొకటి ఉండదు. కన్నడ నటి.. రాజకీయ నాయకురాలు దివ్య స్పందన ఇలాగే చేసిందని మండి పడుతున్నారు కర్ణాటక జనాలు. హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అనుభవించిన తర్వాత రమ్య అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చింది. ఐతే ఆమె రాజకీయారంగేట్రం చేయడానికి ప్రధాన కారణం కన్నడ సినీ ప్రేక్షకులు రెబల్ స్టార్ గా పిలుచుకునే అంబరీష్. ఆమెకు రాజకీయ భిక్షపెట్టింది అంబరీషే. అలాంటి వ్యక్తి మరణిస్తే పార్థివ దేహాన్ని చూడటానికి కూడా రమ్య రాలేదు. కేవలం ట్విట్టర్లో ఒక సంతాప సందేశం పెట్టి ఊరుకుంది. ఢిల్లీలో ఉన్న ఆమె బెంగళూరుకు రానే లేదు. తన రాజకీయ గురువు అంబరీష్ మరణిస్తే నివాళులు అర్పించడానికి దివ్య రాలేదని.. ఇండియాలోనే ఉంటూ కూడా అంత్యక్రియలకు రాకపోవడం దారుణమని.. ఆమెకు తగిన గుణపాఠం చెబుతామని ఆమె ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మండ్య నియోజకవర్గానికి చెందిన నాయకులు.. కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
రమ్య రాజకీయ అరంగేట్రం అనుకోకుండా జరిగింది. అప్పటికే మండ్య జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉన్న అంబరీష్ ను ఆశ్రయించిందామె. తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కాళ్ల మీద పడటం కూడా జనాలు మరిచిపోలేరు. ఆయన చేతుల మీదుగానే ఆమె రాజకీయాలకు పరిచయం అయింది. కాంగ్రెస్ పార్టీలో చేరి అనుకోకుండా ఎంపీ కూడా అయింది. ఆమెకు టికెట్ ఇవ్వాలని సిఫారసు చేయడమే కాదు.. మద్దతుగా ప్రచారం చేసి ఎంపీగా గెలవడంలో కీలక పాత్ర పోషించారు అంబరీష్. ఆరు నెలలే పదవిలో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత పార్టీలో కీలకంగానే వ్యవహరిస్తోంది దివ్య. ఐతే రాహుల్ గాంధీకి క్లోజ్ అయ్యాక రమ్య.. అంబరీష్ ను లెక్క చేయలేదని.. ఆయనకు ఎదురు తిరిగారని విమర్శలొచ్చాయి. 2014 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అంబరీష్ రమ్యకు మద్దతుగా ప్రచారం చేయలేదు. ఆమె దారుణంగా ఓడిపోయింది. అప్పట్నుంచి అంబరీష్ ను లెక్క చేయట్లేదామె. ఐతే పాత వ్యవహారాలు ఎన్ని ఉన్నప్పటికీ అంబరీష్ చనిపోతే వచ్చి నివాళి అర్పించడం ధర్మం. కానీ రమ్య నివాళిగా ఒక ట్వీట్ పెట్టి ఊరుకుంది. దీంతో ఆమెపై జనాలు మండిపడుతున్నారు. బెంగళూరుకు వస్తే అంబరీష్ పార్థివ దేహాన్ని చూడటానికి వెళ్లాల్సి వస్తుందని.. రమ్య కావాలనే ఢిల్లీలో ఉండిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి.