Begin typing your search above and press return to search.
ఆ వివాదాస్పద నటితో మోడీకి చెక్
By: Tupaki Desk | 11 May 2017 9:48 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ సోషల్‌మీడియాలో ముందంజ సాధించి రాజకీయాలపై పట్టు బిగించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఆ దిశగా దృష్ట్టి సారిస్తోంది. కాంగ్రెస్ ఆన్‌లైన్ బ్రాండ్ ఇమేజీ పెంచాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ సోషల్ మీడియా విభాగం నిర్వహణకు కన్నడ సినీనటి, మాజీ ఎంపీ రమ్యను ఎంపిక చేశారు. త్వరలో ఈ నియామకంపై ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. డిజిటల్ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతిగా ఆమె సోషల్ మీడియాతో పాటుగా ఐటీ వ్యవహారాలను చూస్తారు.
కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగాన్ని స్థాపించి ఐదేళ్లపాటు నిర్వహించిన దీపిందర్ హూడా గణనీయమైన ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో మరింత ముందుకు తీసుకుపోవడంలో భాగంగా రమ్యకు పగ్గాలు అప్పగించారు. కాగా మాజీ ఎంపీ, ప్రముఖ నటి అయిన రమ్యకు ట్విట్టర్‌లో 4.83 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరించే రమ్యకు సోషల్ మీడియా పగ్గాలు అప్పగించడం ద్వారా ఆన్‌లైన్ ప్రచారంలో అగ్రస్థానానికి చేరుకోవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది.
కాగా, కొద్దికాలం క్రితం రమ్య వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌కు వెళ్లిన రమ్య అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని ఇండియాకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్‌లో పరిస్థితులు బాగున్నాయని, అది చాలా మంచి దేశమని మెచ్చుకున్నారు. పాకిస్తాన్‌కు వెళితే నరకానికి వెళ్లినట్లు ఉంటుందని అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పడం సరికాదని ఖండించారు. ఇండియాలో ప్రజలు ఎలా నివసిస్తున్నారో, పాక్‌లో కూడా అలాగే ప్రజలు ఉన్నారని, అది చాలా మంచి దేశమని అన్నారు. పాక్ వెళ్లిన వారిని బాగా చూసుకుంటారని కూడా వ్యాఖ్యానించారు. రమ్య వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర నిరససలు తెలిపాయి.