Begin typing your search above and press return to search.
ఐఎస్ సానుభూతిపరులకు అధికారుల ‘ఈద్’ మోనూ
By: Tupaki Desk | 8 July 2016 4:58 AM GMTప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఐఎస్ సానుభూతిపరులకు రంజాన్ సందర్భంగా వారు కోరుకున్న ప్రత్యేక ఆహారాన్ని అందించారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. అంతేకాదు.. పండుగ సందర్భంగా వారి కుటుంబీకుల్నీ కలిసే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్ లో పెను విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసి.. తమ ప్రణాళికను అమలు చేయటానికి కేవలం మూడు.. నాలుగు రోజుల ముందు జాతీయ దర్యాప్తు బృందం.. హైదరాబాద్ పోలీసులు మెరుపు వేగంతో వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకోవటంతో భారీ ముప్పు తృటిలో మిస్ కావటం తెలిసిందే.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో తాము అదుపులోకి తీసుకొన్న ఐదుగురు నిందితులను 12 రోజుల పాటు కస్టడీలో తీసుకున్న అధికారులు.. వారు కోరిన మీదట రంజాన్ సందర్భంగా ప్రత్యేక భోజనాన్ని.. వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇంటి భోజనం తినేందుకు నిబంధనలు ఒప్పుకోని నేపథ్యంలో వారు కోరుకున్నట్లుగా షీర్ కుర్మా.. బిర్యానీ.. డ్రైఫ్రూట్స్ తో చేసిన ఖీర్ ను వారికి ఇచ్చారు. ఒక్కొక్కరి కుటుంబం నుంచి ఇద్దరిని కలిసేందుకు అవకాశం ఇచ్చారు.
వందలాది ప్రాణాల్ని బలి తీసుకునేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసిన వారి కోర్కెల్ని తీర్చేందుకు అధికారులు అంత సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఐఎస్ సానుభూతి పరులు అనుకున్నట్లుగా ప్లాన్ అమలు అయి ఉంటే.. ఎన్ని కటుంబాలు నాశనమయ్యేవి? ఎన్ని అమాయక ప్రాణాలు గాల్లోకి కలిసిపోయేవి? ఎంతమంది తల్లులకు కడుపుకోతకు గురయ్యేవి? మరి.. అలాంటప్పుడు నిందితుల విషయంలో మరీ అంత సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందా..? అన్నదే పెద్ద సందేహం. మనిషి ప్రాణాల్ని తీయాలనుకున్న రాక్షసుల పట్ల కరుణ.. జాలిగా వ్యవహరించాల్సిందేనా..?