Begin typing your search above and press return to search.
రానా..కేటీఆర్ ల మధ్య ఈ ట్వీట్ లేందో?
By: Tupaki Desk | 14 Nov 2015 2:41 PM GMT‘‘కేటీఆర్ సర్ నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? త్వరలో మనం తప్పకుండా కలుద్దాం. చాలా ఆసక్తికర విషయాలున్నాయి. కలుసుకొని మాట్లాడుకుందాం’’ – రానా
‘‘ఇప్పట్లో కుదరదు. ప్రస్తుతం నేను వరంగల్ ప్రచారంలో ఉన్నా. వారం తరువాత వస్తా’’ – కేటీఆర్
‘‘ వారంలోగా కాల్ చేస్తా’’ – రానా
ఇలా సాగుతోంది మంత్రి కేటీఆర్.. ప్రముఖ నటుడు రానాల మధ్య ట్విట్టర్ సంభాషణ. ఇద్దరూ ప్రముఖులే. వారిద్దరి మధ్య ట్వీట్ల వ్యవహారం చూస్తే.. ఇద్దరి మధ్య కాస్తంత మంచి పరిచయం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి.. ఇంత పరిచయం ఉన్నప్పుడు.. ట్విట్టర్ లో ఈ కబుర్లేందన్న సందేహం కలగదు. నిజానికి చాలా ఆసక్తికర విషయాలు ఉంటే.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో మాట్లాడకుండా.. ట్విట్టర్ లో ఈ ట్వీట్లు ఏందో ఒక పట్టాన అర్థం కాదు.
చేతిలో సెల్ ఫోన్లు లేనప్పుడు.. సందేశాలు ఇచ్చి పుచ్చుకోవటం బాగానే ఉంటుంది. అయినా.. పబ్లిక్ గా అందరికి తెలుస్తాయని తెలిసి కూడా ఆసక్తికర విషయాలు ఉన్నాయి.. మనం కలిసినప్పుడు చెబుతానంటూ అంత ఊరింపు ఎందుకు?
రానా ఊరిస్తే.. మంత్రి కేటీఆర్ ఊరిపోకుండా.. సర్లే.. వారం తర్వాత కలుద్దాం.. వరంగల్ ప్రచారంలో ఉన్నానంటూ ముక్తసరిగా సమాధానం చూసినప్పుడు.. వీరి మధ్య ఆ ఆసక్తికర వ్యవహారం ఏందో అన్న ఆసక్తి కలగటం ఖాయం. ఇంతకీ కేటీఆర్ ను ఉద్దేశించి రానా ఊరిస్తున్న ఈ ఆసక్తికర అంశం ఏమిటో..? ఇద్దరు ప్రముఖులు ఒకరిని ఒకరు ఊరించుకుంటే బానే ఉంటుంది. మధ్యలో జనాల దృష్టి తమ మీద పడేలా ఈ బహిరంగ ట్వీట్లు ఏందో..?