Begin typing your search above and press return to search.
హిందీ మాట్లాడే ఏకైక హ్యుమనాయిడ్ రోబో!
By: Tupaki Desk | 5 Aug 2018 10:18 AM GMTహ్యూమనాయిడ్ రోబో సోఫియాకు చెల్లెలు దొరికింది. దీని పేరు రష్మీ. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన 38ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రంజిత్ శ్రీవాత్సవ ఈమెను సృష్టించాడు. హాంకాంగ్ సంస్థకు చెందిన ప్రత్యేక సాప్ట్ వేర్ సహాయంతో దీన్ని తయారు చేశారు. రెండేళ్ల కిందట ప్రారంభించిన ప్రాజెక్టు తుదిదశకు చేరింది. 30 రోజుల్లోనే తల - ముఖం అమరిక పూర్తిచేశానని రంజిత్ చెప్తున్నారు. మిగతా శరీర అవయవాలను త్వరలోనే బిగిస్తామని తెలిపారు.
ప్రపంచంలో హిందీ మాట్లాడే ఈ ఏకైక రోబో - ఇంగ్లీషుతోపాటు - భారతీయ భాషలైన భోజ్ పురి - మరాఠీ కూడా మాట్లాడగలదు. ఇప్పటి వరకు దీని తయారీకి 50వేల రూపాయలు ఖర్చయినట్లు అతను తెలిపాడు. 15 ఏళ్ల కిందట మదిలో మెదిలిన ఆలోచన ఇది. 2016లో ఈ హ్యుమనాయిడ్ రోబోకు శ్రీకారం చుట్టాను. ఇందుకు హాంగ్ కాంగ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ను ఉపయోగించాను. భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ము ఖ్యంగా ఒంటరి తనంతో కుమిలిపోయే వాళ్లకు మంచి స్నేహితులుగా ఈ రోబోలు చేరువవుతాయంటున్నారాయన.
ఇందులో అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా ఎదుటి వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేసి గుర్తు పెట్టుకుంటుంది. కళ్లు - పెదాలు - కనుబొమ్మలను కదిలిస్తూ ఇది మాట్లాడగలదు. ఇందులో లింగ్విస్టిక్ ఇంటర్ ప్రిటేషన్ - కృతిమమేధ - విజువల్ డేటా - ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థలున్నాయి. ఏకబిగిన నాలుగు గంటలు మాట్లాడగలదు అని రంజిత్ వివరించాడు. ఎవరైనా ప్రశంసిస్తే థ్యాంక్స్ చెబుతుంది. చిరాకు కలిగిస్తే - బాధిస్తే మాత్రం గో టు హెల్ అంటూ కసురుకుంటుంది. సోఫియా - రష్మి ఇద్దరూ బాలీవుడ్ స్టార్ షారూఖ్ అభిమానులే కావడం విశేషం. భవిష్యత్ లో రిసెప్షనిస్టులు - హెల్పర్లు ఉద్యోగాల్లో రోబోలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందంటున్నాడు రంజిత్.