Begin typing your search above and press return to search.

అమెరికాలో తొలి సెనెటర్ కు కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   23 March 2020 11:00 PM IST
అమెరికాలో తొలి సెనెటర్ కు కరోనా పాజిటివ్
X
అమెరికాలో సైతం కరోనా విస్తృతమవుతోంది. ఒకేరోజు ఆదివారం 100మంది మరణించారు. తాజాగా ఈ వైరస్ ప్రజాప్రతినిధులకు పాకింది. దేశంలోనే తొలిసారిగా కెంటుకీ రిపబ్లికన్ సెనెటర్ రాండ్ పాల్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న మిగతా సెనెటర్లు అప్రమత్తమయ్యారు. అందరూ టెస్టులు చేసుకుంటూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. ‘ నా స్నేహితుడు సెనెటర్ రాండ్ పాల్ కు పాజిటివ్ చ్చింది... ఈ చైనీస్ వైరస్ నుంచి తొందరగానే బయటపడుతాడు. అతడిప్పుడు బాగానే ఉన్నాడు.. తొందరలోనే కోలుకుంటాడు’ అని భరోసానిచ్చాడు.

ఇక సెనెటర్ కార్యాలయం కూడా అధికారికంగా స్పందించింది. రాండ్ పాల్ బాగానే ఉన్నాడని.. అతడితో కలిసిన వారంతా క్వారంటైన్ లో ఉన్నారని.. త్వరలోనే రాండ్ కోలుకుంటారని తెలిపారు.

ఇక పాల్ కు కరోనా వైరస్ వచ్చినా నిర్బంధాన్ని పాటించకుండా బయట తిరిగాడని.. మిగతా సెనెటర్లకు కూడా కరోనా వచ్చి ఉంటుందన్న భయం వారిని వెంటాడుతోంది.

ఇటీవలే కెంటుకీలోని లూయిస్ విల్లెలో జరిగిన ఒకసామాజిక కార్యక్రమానికి రాండ్ పాల్ హాజరయ్యాడు. అక్కడే ఇతడికి వైరస్ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇక పాల్ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఇప్పుడు స్వీయ నిర్బంధానికి వెళ్లారు. కరోనా టెస్టులు చేసుకుంటున్నారు. పాల్ గత వారం జిమ్ కు వెళ్లాడట.. స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొట్టాడు. ఇప్పుడు అతడితో కలిసి పాలుపంచుకున్న వారంతా హడలి చస్తున్నారు. పాల్ చాలా మందికి అంటించి ఉంటాడని భావిస్తున్నారు.