Begin typing your search above and press return to search.

యాదృచ్ఛికం.. ఒకే రోజు ఆ రెండు

By:  Tupaki Desk   |   10 Nov 2019 8:27 AM GMT
యాదృచ్ఛికం.. ఒకే రోజు ఆ రెండు
X
కొన్నిసార్లు కొన్ని అంశాల్ని తరచిచూస్తే ఆశ్చర్యమే కాదు.. విస్మయానికి గురవుతాం. తాజాగా చెప్పేది అలాంటిదే. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేయాలంటూ విశ్వహిందూ పరిషత్ అప్పుడెప్పుడో 1989లో తొలిసారి శంకుస్థాపన చేసింది. ఇందుకు పెట్టిన ముహుర్త బలమో ఏమో కానీ.. ఇది జరిగిన 30 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు అయోధ్యలో రామాలయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం పచ్చ జెండా ఊపుతూ చారిత్రాత్మక తీర్పును వెలువరించటం విశేషం.

1989 నవంబరు 9న అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం తొలిసారి శిలన్యాస్ (శంకుస్థాపన) కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈ ఉదంతంలో చోటు చేసుకున్న మలుపులు అన్ని ఇన్ని కావు. అనూహ్యంగా నవంబరు 9, 2019 నాడు ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

వివాదాస్పద భూమిలో రామాలయ నిర్మాణానికి అంగీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. శంకుస్థాపన జరిపిన రోజునే దేవాలయాన్నినిర్మించేందుకు వీలుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యాదృచ్ఛికంగా చెప్పక తప్పదు. అయినప్పటికీ.. ఒకే రోజున రెండు కీలక ఘట్టాలు చోటు చేసుకోవటం.. అవి రెండు రామాలయ నిర్మాణానికి కారణమైనవి కావటం విశేషంగా చెప్పక తప్పదు. ముహుర్త బలం అంటే ఇదేనేమో?