Begin typing your search above and press return to search.
వంగవీటిపై రంగా ఫాన్స్ ఏమంటున్నారంటే..!
By: Tupaki Desk | 23 Dec 2016 4:58 PM GMTవంగవీటి రంగా జీవితంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ శుక్రవారం విడుదల అయింది. మొదట్నుంచీ ఈ చిత్రంపై విజయవాడలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే అక్కడ వంగవీటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఆయన జీవితం గురించి తెలిసినవారున్నారు. రంగా హత్యకు సంబంధించిన వాస్తవాలు చూసినవారు కూడా ఉన్నారు. ఈ వాస్తవాలను వర్మ ఏవిధంగా తెరకెక్కించి ఉంటారన్న ఉత్కంఠతో చాలామంది థియేటర్లు వెళ్లారు. అయితే, సినిమా పూర్తవగానే చాలామంది నిరాశతో బయటకి వచ్చారని చెప్పాలి.
వంగవీటి సినిమా మీద వంగవీటి రాధ స్పందించారు. ఈ సినిమా విషయమై మొదట్నుంచీ తాము చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చామనీ, వ్యతిరేకించామని అన్నారు. వంగవీటిలో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ఉన్నాయని రాధా అన్నారు. ఈ సినిమా విషయమై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. వంగవీటిలో కల్పితాలు ఎక్కువగా ఉన్నాయనీ, వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరినట్టు చెప్పారు.
వంగవీటి రంగా అభిమానులు అయితే ఈ చిత్రంపై దుమ్మెత్తి పోశారు. తమకు తెలిసిన వంగవీటి వేరనీ, సినిమా పేరుతో చూపించిన వ్యక్తి వేరని అన్నారు. కేవలం రంగా ఇంటి పేరును సినిమాకు పెట్టుకుని డబ్బు సంపాదించడం కోసమే ఈ సినిమా తీశారని మండిపడుతున్నారు. తమ తాతాలూ తండ్రులూ వంగవీటి రంగా గురించి గొప్పగా చెప్పారనీ, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశావారని విన్నామనీ, అయితే ఈ సినిమా వంగవీటిని కేవలం రౌడీ పాత్రగా వర్మ చిత్రీకరించారని అభిమానులు అంటున్నారు.
వంగవీటిని హత్య చేసింది ఎవరో ఆ దుర్గమ్మకే తెలియాలని సినిమాలో వర్మా చెప్పాడనీ, ఆయన్ని ఎవరు చంపారో అందరికీ తెలుసని కొందరు అభిమానులు విమర్శించారు. ఆర్జీవికి విజయవాడ గురించి ఏమీ తెలీదనీ, గతంలో కూడా ‘బెజవాడ రౌడీలు’ అంటూ ఏదో చెప్పాలనుకున్నాడనీ.. ఎవ్వరికీ నచ్చకుండా పోయిందనీ, ఇదీ అంతేనని కొంతమంది అంటున్నారు. ఈ సినిమాకు వంగవీటి పేరును తీసేశాయాలని మరికొందరు డిమాండ్ చేశారు. మొత్తానికి విజయవాడ వాసుల నుంచి ఈ చిత్రంపై మిశ్రమ స్పందనే లభిస్తోందని చెప్పాలి.