Begin typing your search above and press return to search.
బీజేపీ సంచలనం.. అసోం సీఎం అభ్యర్థిగా రంజన్ గొగోయ్?
By: Tupaki Desk | 23 Aug 2020 8:10 AM GMTబీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామమందిరం, త్రిపుల్ తలాక్ సహా కీలకమైన బిల్లులన్నింటిని ఆమోదించిన.. బీజేపీకి ఫేవర్ గా నిర్ణయాలు తీసుకున్న సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ను ఏకంగా అసోం బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతోందని తెలిసింది. దీన్ని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ప్రకటించడం రాజకీయ వర్గాలను షేక్ చేసింది.
వచ్చే అసోం ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఆయనే సీఎం అభ్యర్థిగా బీజేపీ తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని అసోంలో ప్రచారం జరుగుతోంది. అయోధ్య బాబ్రీ మసీదు-రామమందిర వివాదానికి ముగింపు పలికిన రంజన్ గొగోయ్ తీర్పుతో బీజేపీ సంతోషంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని.. రాజ్యసభ ఎంపీగా కూడా చేయడానికి ఒప్పుకున్నారు.
ఇప్పుడు బీజేపీ ఈయనను అసోం సీఎంగా చేయడానికి చూస్తుందని తెలిసింది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా జరిపిందని.. రంజన్ ఒప్పుకున్నట్టు అసోంలో ప్రతిపక్షాలు, మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇటు బీజేపీ కానీ.. అటు రంజన్ గొగోయ్ కానీ అధికారికంగా స్పందించలేదు.