Begin typing your search above and press return to search.
బ్రబోర్న్ స్టేడియంలో రణవీర్ కల్లోలం!
By: Tupaki Desk | 7 May 2022 12:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కి క్రికెట్ అంటే పిచ్చి. ఇండియా అంతర్జాతీయ మ్యాచ్ లకు కచల్చితంగా హాజరవుతుంటాడు. వెంట భార్య దీపికా పదుకొణేని కూడా తీసుకొస్తాడు. దంపతులిద్దరు గ్యాలెరీలో కూర్చొని మ్యాచ్ ని ఆస్వాదిస్తూ టీమ్ ఇండియాకి మద్దతుగా నిలుస్తుంటారు. ఇక దీపికా పదుకొణే స్పోర్స్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే.
తండ్రి ప్రకాష్ పదుకొణే పెద్ద ప్లేయర్ కమ్ కోచ్. దీపిక బ్యాడ్మింటన్ స్టార్ కాబోయ్ యాక్టర్ అయింది లేదంటే తను పెద్ద స్పోర్స్ట్ ప్లేయర్ అయ్యేది. క్రీడాకారుడినే వివాహం చేసుకునేది. కానీ తన జీవితంలో రంగుల ప్రపంచం..రణవీర్ సింగ్ తోనూ ముడిపడి ఉండటంతో అలా ముందుకెళ్తోంది.
తాజాగా రణవీర్ సింగ్ బ్రబోర్స్ స్టేడియంలో అల్లకల్లోలం సృష్టించాడు. రణవీర్ హడావుడికి యావత్ స్టేడియం అతని వైపే చూసింది. జరిగిన మ్యాచ్ కన్నా రణవీర్ సింగ్ ఎక్కువ పాపులర్ అయ్యాడు. టీవీ ప్రేక్షకుల్ని సైతం రణవీర్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఆకట్టుకుందని చెప్పొచ్చు . వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ మధ్య బ్రబోర్న్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది.
ముంబై మద్దతుదారుడిగా రణవీర్ గ్యాలరీలో కూర్చున్నాడు. 5 పరుగల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ ప్రారంభం దగ్గర నుంచి ముగింపు వరకూ రణవీర్ మెరుపులు స్టేడియంలో మామాలుగా మెరవలేదు. ముంబై ఇండియన్స్ అంటూ ఒకటే ఊగిపోయాడు. ఫేస్ లో రకరకాల ఎక్స్ ప్రెషన్ తో కెమెరా కళ్లు అన్ని తనవైపుకే తిప్పుకున్నాడు.
ముంబై టీమ్ కి ఏది ఫేవర్ గా జరిగిన అతని ఆనందానికి అవధుల్లేవ్. ముంబై ప్లేయర్ సిక్స్ కొడితే వైల్డ్ రియాక్షన్ తో చెలరేగిపోయేవాడు. కెప్టెన్ డీఆర్ ఎస్ తీసుకో అంటూ గ్యాలరీ నుంచే సైగలు చేసేవాడు. ఇంకా గ్యాలరీ నుంచి చాలా హంగామనే క్రియేట్ చేసాడీ సింగ్. అయితే అది నచ్చని కొంత మంది నెటి జనులు రణవీర్ ఓవరేక్షన్ చూడలేకపోతున్నాం ..అతన్ని ఆపండ్రా బాబు అంటూ కామెంట్లు పోస్ట్ చేసారు.
క్రెడ్ యాప్ యాడ్ తో రణవీర్ పై జోకులేస్తున్నారు. ఇటీవలే రణవీర్ నటించిన `83` సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ నటించాడు. ఈ నేపథ్యంలో రణవీర్ ఇంకా ఆ పాత్ర నుంచి బయటకు రాలేదని..అందుకే మ్యాచ్ ని ఇంతగా ఓన్ చేసుకున్నాడని మరికొంత మంది ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేసారు. అయితే ఈ మ్యాచ్ చూడటానిక దీపికా పదుకొణే రాలేదు. లేదంటే జనాలంతా ఆమె మీద పడేవారేమో.