Begin typing your search above and press return to search.
రాపాకా విషయం లో పవన్ నిస్సహాయత
By: Tupaki Desk | 22 Jan 2020 11:15 AM GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇది పెద్దగా ఎవ్వరినీ ఆశ్చర్య పరచలేదు.
వాస్తవానికి, జనసేన ఎమ్మెల్యే రాపాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ రాపాకా పై చర్య తీసుకోవడానికి పవన్‌కు ధైర్యం చేయక పోవడం ఆయన నిస్సహాయత కు నిదర్శనమి చాలా మంది ఆడిపోసుకున్నారు.
పవన్ నిర్ణయానికి వ్యతిరేకం గా వెళ్తూ.. వైఎస్‌ఆర్‌సి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతు గా సోమవారం కూడా రాపాక అసెంబ్లీ లో మాట్లాడారు.
అయితే అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం ఏమిటంటే, జనసేన పార్టీ వర్గాల నుండి వచ్చిన ప్రెస్ నోట్ నకిలీదని తేలింది. తాజా ప్రెస్ నోట్ లో రాపాకాను సస్పెండ్ చేసే ఉద్దేశ్యం పవన్‌కు లేదని జనసేన పార్టీ తెలుపడం తో పవన్ , జనసేన అభాసుపాలైంది.
ఇటీవలే జగన్ కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమ శిక్షణను ఉల్లంఘించినందుకు రాజకీయ వ్యవహారాల కమిటీ లో ఈ అంశంపై చర్చిస్తానని, రాపాకా పై తగిన చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు.
అయితే, పవన్ ఈ ప్రకటన చేసి 24 గంటలు అయ్యింది, కాని ఎమ్మెల్యేపై పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోలేదు.దారుణమైన విషయం ఏమిటంటే, బుధవారం అసెంబ్లీ లో రాపాక మళ్ళీ మాట్లాడి, రితు భరోసా పై జగన్ మోహన్ రెడ్డి కి మద్దతు ఇచ్చారు. సభకు భంగం కలిగించినందుకు టిడిపి ఎమ్మెల్యేల పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రజోల్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాపాక, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి, వైయస్ఆర్సి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నా కూడా ఇంకా పవన్ ఆయనను సస్పెండ్ చేయకుండా తన ఏకైక ఎమ్మెల్యేను కాపాడుకుంటూ వస్తుండడం శోచనీయం..
3 రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ , సిఆర్డిఏ రద్దు చర్యలకు మద్దతిస్తూ పవన్ కళ్యాణ్ జారీ చేసిన సూచనల కూడా పట్టించుకోకున్నా రాపాకపై చర్యలు తీసుకోలేని నిస్సహాయత పవన్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది.