Begin typing your search above and press return to search.
జగన్ - పవన్ ఇద్దరూ రాపాక ధైర్యం కాదట!
By: Tupaki Desk | 13 Aug 2020 5:35 PM GMTరాపాక వరప్రసాద్...జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఎంత సంచలనం సృష్టించారో అనంతరం ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలతో అంతకంటే ఎక్కువ సంచలనంగా మారుతున్నారు. తనకు బీఫాం ఇచ్చిన గెలిపించిన జనసేన పార్టీనే తీవ్రంగా తప్పుపడుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ వ్యతిరేకించిన ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించారు. సీఎం జగన్‌ను పవన్ విమర్శిస్తే అసెంబ్లీ సాక్షిగా సీఎం సూపర్ అని రాపాక కీర్తించారు. ఇదే ఒరవడిలో పలు నిర్ణయాలను ప్రశంసించారు. తాజాగా ఏకంగా తనను తాను వైసీపీ ఎమ్మెల్యేగా ప్రకటించుకొని సంచలనం సృష్టించారు. రాపాక ఇలా దైర్యంగా కామెంట్లు చేయడం అసలు లెక్క వేరేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దికాలం తర్వాతి నుంచి రాపాక కామెంట్ల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కామెంట్లు తారాస్థాయికి చేరుకొని జనసేన గాలివాటం పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రాజోలులో వైసీపీ సీట్ రావాల్సింది తనకేనని చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో సీట్ మిస్ అవడం, జనసేన నాయకులంతా తనను పోటీ చేయాలని కోరడంతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగానని ఆయన అన్నారు. తన గెలుపులో జనసేన పాత్ర సూన్యం అన్న మాట పరోక్షంగా చెప్పేశారు. ఇంతేకాకుండా తాను వైసీపీ ఎమ్మెల్యేనని పేర్కొంటూ రాజోలులో వైసీపీలో ఉన్న మూడు గ్రూపుల్లో తనదీ ఒకటిగా ఆయన ప్రకటించారు.
బహిరంగంగానే రాపాక ఇలా ప్రకటించడం వెనుక పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా ఆయన ఎమ్మెల్యే సీటుకు ఎలాంటి ఢోకా లేకపోవడమని చెప్తున్నారు. తాను మాట్లాడేది ప్రభుత్వం పక్షాన కావడంతో తనపై అనర్హత కోసం జనసేన స్పీకర్ కు కంప్లైంట్ చేసినా వేటు పడదనే ధైర్యంతో రాపాక ఉన్నారంటున్నారు. జనసేన అధినేత పవన్‌ను టార్గెట్ చేయడం అధికార పక్షానికీ ఇష్టమే కాబట్టి ఏ రకంగా చూసినా తను సేఫ్ అని ఆయన భావిస్తున్నారట. దీనికంటే మరో ముఖ్యమైన కారణం ఇతర రెబల్ ఎమ్మెల్యేల ఉదంతం. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు పలికిన వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులు ఇంకా విచారణలోనే ఉన్నాయి. స్పీకర్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఒకవేళ తన మీద ఫిర్యాదు చేసినా... అది ఇప్పట్లో శుభం కార్డు పడే పరిస్థితి ఉండదు. ఇలాంటి లెక్కలు వేసుకొన్న తర్వాతే రాపాక ఇలా దూకుడుగా ముందుకు సాగుతున్నారని చర్చ జరుగుతోంది.