Begin typing your search above and press return to search.
ఏపీలో అంబేద్కర్ జిల్లా కోసం డిమాండ్...!
By: Tupaki Desk | 28 Jan 2022 12:30 PM GMTఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో కొందరు ఖుషీగా ఉంటే.... మరి కొందరు అసహనాలు, అసంతృప్తిలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇప్పటికే పలువురు నేతలు, మహానీయుల పేర్లు కొన్ని జిల్లాలకు పెట్టారు. ఇక ఇప్పటికే 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ గెజిట్‌లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు కొన్ని జిల్లాలకు కొందరు నేతలు, మహనీయుల పేర్లు పెట్టాలన్న కొత్త డిమాండ్లు వస్తున్నాయి. దివంగత కాపు నేత వంగవీటి రంగా పేరు విజయవాడ జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ వస్తోంది. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు సరికాదని.. అవసరం అయితే ఎన్టీఆర్ పేరు మచిలీపట్నంకు పెట్టుకుని.. విజయవాడకు రంగా పేరు పెట్టాలని అక్కడ డిమాండ్ వస్తోంది.
ఇక కోనసీమ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ డిమాండ్‌ను జనసేన జంపింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్వయంగా లేవనెత్తారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును తాను స్వాగతిస్తున్నానని చెప్పిన రాపాక వరప్రసాదరావు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని
తెలిపారు.
అమలాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు అన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించారు. చారిత్రక నేపథ్యం ఉన్న కోనసీమ పేరు కొనసాగిస్తూనే అంబేద్కర్ పేరు జతచేయాలని ఆయన కోరారు.
అమలాపురం కేంద్రంగా ఏర్పాటు అయిన జిల్లాను కోనసీమ అంబేద్కర్ జిల్లాగా మార్చాలని కోరారు. తన నియోజకవర్గం రాజోలుతో పాటు గన్నవరం, అమలాపురం, కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో ఎస్సీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని రాపాక చెప్పారు. అమలాపురం లోక్‌సభ స్థానం కూడా ఎస్సీ రిజర్వుడ్‌కు చెందినదేనని గుర్తు చేశారు. అందుకే తాము అంబేద్కర్ పేరు జతచేయాలని కోరుతున్నామని ఆయన చెప్పారు.