Begin typing your search above and press return to search.
పవన్ కు మరో షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
By: Tupaki Desk | 12 Dec 2019 5:20 AM GMTఇంట గెలవకముందే రచ్చ గెలవడానికి బయలు దేరారు మన జనసేనాని పవన్ కళ్యాణ్. సొంత జనసేన పార్టీ ఎమ్మెల్యేనే పవన్ కు వ్యతిరేకంగా వెళుతూ అసెంబ్లీలో జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులకు మద్దతు తెలిపేశారు. ఓ వైపు పవన్ సీఎం జగన్ తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఆయన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ నిర్ణయాన్ని ఆకాశానికెత్తేశారు.
నిన్న జగన్ కు మద్దతు తెలిపి గట్టి షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ తాజాగా పవన్ ను మరో గట్టి దెబ్బకొట్టారు.జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడ లో రైతుల సమస్యల పై ‘రైతు సౌభాగ్య దీక్ష’కు దిగుతున్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ దీక్షకు జనసేన నేతలందరూ హాజరవుతున్నా.. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక మాత్రం తాను హాజరు కావడం లేదని ప్రకటించడం సంచలనమైంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను పవన్ కళ్యాణ్ దీక్షకు హాజరు కాలేకపోతున్నట్టు ఎమ్మెల్యే రాపాక పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం జరగడం లేదని.. ఈ విషయం లో పవన్ కు తనకు మధ్య విభేదాలున్నాయని ఆయన బాహాటం గా ప్రకటించడం దుమారం రేపుతోంది.
ఓ వైపు పవన్ ‘మన నుడి మన నది’ కార్యక్రమం ద్వారా జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులపై ఉద్యమిస్తుండగా.. ఆయన పార్టీ ఎమ్మెల్యే మాత్రం పవన్ కు వ్యతిరేకంగా జగన్ కు సపోర్టు చేయడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా పవన్ దీక్షకు దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.