Begin typing your search above and press return to search.
ఆహా..! రాపాక వాయిస్ కూడా మారిందిగా...!
By: Tupaki Desk | 10 Aug 2019 2:30 PM GMTఏపీలో జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి రెండు నెలలు దాటుతుంది. అయితే ఆరు నెలల పాటు ప్రభుత్వానికి సమయం ఇస్తామని చెప్పిన టీడీపీ, జగన్ సీఎం అయిన రెండు మూడు రోజులు నుంచే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం చేపడుతున్న విధివిధినాలని తప్పుబడుతున్నారు. రోజు ఏదొక ఇష్యూ మీద టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్ లు ట్విట్టర్ వేదికగా విమర్శనస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. టీడీపీతో పాటు బీజేపీ కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది.
ప్రజావేదిక కూల్చడంలో- విద్యుత్ పీపీఏలు- పోలవరంలో రివర్స్ టెండరింగ్ కి వెళ్లడంపై బీజేపీ వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. అయితే జనసేన పార్టీ మాత్రం రెండు పార్టీలు విరుద్ధంగా నడిచింది. ప్రభుత్వం మంచి చేస్తే సపోర్ట్ చేస్తామని చెబుతూ, తప్పు చేస్తే ప్రశ్నిస్తాం అన్నారు. ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. వైసీపీ నేతలకి తక్కువ కాకుండా జగన్ ని దేవుడంటూ పొగిడేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అంటూ రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక మొన్నటివరకు జగన్ ని దేవుడని పొగిడిన రాపాక తాజాగా వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఈరోజు రాపాక తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నూతన ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని అన్నారు. దేశంలోనే మన రాష్ట్రం చాలా వెనకబడి ఉందని, ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలని, కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని చెప్పుకొచ్చారు.
అయితే రాపాక ఇలా హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ రాపాకతో కూడా సమావేశమయ్యారు. ఆయన సూచనల మేరకే రాపాక తన పంథా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అటు పవన్ కూడా వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి కొద్దిరోజుల్లోనే రాపాక వాయిస్ బాగానే మారింది.