Begin typing your search above and press return to search.
పార్టీ ఎందుకు ఓడిందో చెప్పిన పవన్ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 7 Jun 2019 4:30 PM GMTఎన్నికలు ఏదైనా.. సదరు పార్టీ అధినేత ఎన్నికల్లో ఓడిపోయి.. ఒక్క ఎమ్మెల్యే గెలుపొందటంలాంచి సిత్రాలు చూసి ఉండరు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ లోటును తీరుస్తూ జనసేన ఈ అరుదైన ఘనతను సాధించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోతే.. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే రేపాక వరప్రసాద్ మాత్రం ఎన్నికల్లో గెలుపొందారు.
తాజాగా మాట్లాడిన ఆయన.. తమ టార్గెట్ 2024 ఎన్నికలుగా చెప్పారు. ఆ దిశగా తమ అధినేత పని చేస్తున్నట్లు వెల్లడించారు. డబ్బులు వెదజల్లి గెలవాలన్న ఆలోచన లేని వ్యక్తి తమ అధినేత పవన్ అని చెప్పిన ఆయన.. గ్రామ.. మండల స్థాయిలో కమిటీలు లేని కారణంగానే తమ పార్టీ ఓడినట్లుగా తాను భావిస్తున్నట్లు చెప్పారు.
పార్టీ ఓటమికి దారి తీసిన కారణాల్ని తాను ఇప్పటికే పవన్ కు వివరించినట్లుగా వెల్లడించారు. నియోజకవర్గంలో కింది స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవటం.. ప్రణాళిక బద్ధంగా వ్యవహరించటం వల్లే తాను విజయం సాధించినట్లు చెప్పిన రేపాక.. తన గెలుపు సీక్రెట్ చెప్పేశారు.
తమ పార్టీ తరఫున అసెంబ్లీలో తాను ఒక్కడినే ఉన్నప్పటికీ.. తాను ప్రజల పక్షాన నిలుస్తానని.. ప్రరజల పక్షాన ఉంటే ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని.. లేకుంటే మాత్రం నిర్మోహమాటంగా వ్యతిరేకిస్తానని ఆయన ప్రకటించారు. జనసేన నుంచి గెలుపొందిన ఒకే ఒక్కడు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.