Begin typing your search above and press return to search.

మాజీ రేప్ మంత్రికి జైల్లో చుక్క‌లేన‌ట‌!

By:  Tupaki Desk   |   17 March 2017 8:15 AM GMT
మాజీ రేప్ మంత్రికి జైల్లో చుక్క‌లేన‌ట‌!
X
చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారంతా త‌ర్వాతి కాలంలో ఎన్నెన్ని క‌ష్టాలు ప‌డుతుంటారన్న‌ది చ‌రిత్ర చాలానే ఉదాహ‌ర‌ణ‌ల్ని చూపించింది. ప‌వ‌ర్ అహంకారంతో చ‌ట్ట‌వ్య‌తిరేక ప‌నులు చేసిన వారంతా త‌ర్వాతి కాలంలో ప‌డిన తిప్ప‌లు చూసిన త‌ర్వాత కూడా కొంద‌రు నేత‌లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ఉండాల‌న్న భావ‌న క‌ల‌గ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

అలాంటి కోవ‌లోకే వ‌స్తారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి గాయ‌త్రి ప్ర‌జాప‌తి. సామూహిక అత్యాచార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌జాప‌తిని యూపీ ప్ర‌జ‌లు ఇప్పుడు రేప్ మంత్రిగా పిలుచుకుంటున్నార‌ట‌. స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన ప్ర‌జాప‌తికి.. త‌మ పార్టీ ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు కొమ్ములు తిరిగిన పోలీసుల‌కు సైతం చుక్క‌లు చూపించారు. ఆయ‌న్ను ప‌ట్టుకోవ‌టానికి ప్ర‌య‌త్నించిన పోలీసుల‌కు ఒక ప‌ట్టాన దొర‌కలేదు.

తాము కానీ అధికారంలోకి వ‌స్తే.. తాము చేసే మొద‌టి ప‌ని.. రేప్ మంత్రిని లోప‌ల వేయ‌ట‌మే అంటూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఘీంక‌రించారు బీజేపీ చీఫ్ అమిత్ షా. ఆయ‌న చెప్పిన‌ట్లే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి.. బీజేపీ చారిత్ర‌క విజ‌యం సాధించింద‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన రెండు రోజుల‌కే ప్ర‌జాప‌తి పోలీసుల‌కు దొరికిపోయారు.

తాము అదుపులోకి తీసుకున్న ప్ర‌జాప‌తిని న్యాయ‌మూర్తి ఎదుట నిల‌బెట్టిన‌ప్పుడు ఆయ‌న‌కు 14 రోజుల క‌స్ట‌డీని విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్ప‌టి నుంచి జైల్లో ఉంటున్న రేప్ మంత్రి జైలు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ట‌. అధికార మ‌దంతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌జాప‌తికి ఇప్పుడు రాత్రిళ్లు నిద్ర ప‌ట్ట‌టం లేద‌ట‌. జైల్లోకి వ‌చ్చిన రోజు నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న కంటి నిండా నిద్ర పోయింది లేద‌ని.. ఎప్పుడూ ఏదో ఒక‌టి ఆలోచిస్తున్న‌ట్లుగా క‌నిపించేవాడ‌ని అధికారులు చెబుతున్నారు.

జైలుకు వ‌చ్చిన కొత్త‌ల్లో.. త‌న కోసం పెద్ద గేటును తెర‌వాలంటూ హ‌డావుడి చేసిన ప్ర‌జాప‌తి మాట‌ల్ని అధికారులు లైట్ తీసుకొని.. సాధార‌ణ ఖైదీ మాదిరి చిన్న గేటులో నుంచి తీసుకెళ్లార‌ట‌. ఎప్పుడూ త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి హ‌డావుడి చేసే ప్ర‌జాప‌తి.. జైల్లో ఎవ‌రితోనూ మాట్లాడేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/