Begin typing your search above and press return to search.
రేప్ కేసులో బెయిల్.. ఈసారి ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్ చేశారట
By: Tupaki Desk | 4 Aug 2022 11:30 PM GMTఅన్ని కేసులు కాకున్నా.. కొన్ని కేసుల విషయంలో మాత్రం నిందితులకు బెయిల్ ఇచ్చే విషయంలో న్యాయస్థానాలు పునరాలోచన చేయాలా? బెయిల్ మంజూరుకు ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానానికి భిన్నమైన పద్ధతిని పాటించాలా? మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బెయిల్ ఇవ్వాలా? అన్న సందేహాలు వ్యక్తమయ్యే దారుణ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం తెలిస్తే.. రక్తం మరిగిపోవటం ఖాయం.
రేప్ చేసిన నిందితుడికి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో.. సదరు మానవ మృగం చెలరేగిపోయాడు. బరితెగింపునకు పాల్పడ్డాడు. బాధితురాలిని మరోసారి అత్యాచారం చేశాడు. ఈసారి తన స్నేహితులతో కలిసి వచ్చిన అతను ఆమెపై సామూహిక అత్యాచారం చేయటమే కాదు.. ఆ సందర్భంగా వీడియోను తీశాడు. కేసును వాపసు తీసుకోకపోతే బాగుండదని హెచ్చరించాడు. ఇప్పుడీ ఉదంతం పెను సంచనలంగా మారింది.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘోరం విషయానికి వస్తే.. రెండేళ్ల క్రితం బాధితురాలికి పదిహేడేళ్ల వయసు ఉన్న సమయంలో వివేక్ పటేల్ అనే నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో.. అతడిపై కేసు నమోదు చేసిన కోర్టు.. జైలుశిక్షను విధించింది.జైల్లో ఏడాది గడిపిన అతను ఇటీవల బెయిల్ పొందాడు. మరోసారి బాధితురాలిపై కన్నేసిన అతను.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న వేళ.. తన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లాడు.
కత్తులతో బెదిరించాడు. తమ మాట వినకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి.. ఆమెను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం అతడితో పాటు.. అతడి స్నేహితులతోనూ గ్యాంగ్ రేప్ చేయించాడు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై మరోసారి గళం విప్పింది ఆ బాధిత మహిళ. తనపై జరిగిన గ్యాంగ్ రేప్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.
ఈ ఉదంతం సంచలనంగా మారటంతో.. నిందితుడితో పాటు.. అతని స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి కారణంగా తనకు ప్రాణ హాని ఉందని వాపోతుంది బాధిత మహిళ.