Begin typing your search above and press return to search.
మతితప్పిన ములాయం.. ‘రేప్’పై చెత్త కామెంట్లు
By: Tupaki Desk | 20 Aug 2015 7:45 AM GMTఈ ములాయం యాదవ్ కి అప్పుడప్పుడూ మెదడులో పురుగే మైనా తొలుస్తుందో ఏమిటటో.. మహిళల గురించి, వారిపై జరిగే రేప్ ల గురించి దారుణమైన కామెంట్స్ చేస్తుంటాడు. నిర్భయ ఘటన అనంతరం రేపిస్టులకు ఉరి శిక్ష వేయడంపై ఆయన చేసిన మాటల గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ‘‘అబ్బాయిలు అబ్బాయిలే. తప్పులు చేస్తారు. అంతమాత్రాన ఉరి తీసేస్తారా?’’ అంటూ మగాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకుని ములాయం మాట్లాడిన మాటలు సాటి మగాళ్లు సిగ్గుపడేలా చేశాయి. దీన్ని బట్టే ఆయనకు ఆడపిల్లలపై ఏమాత్రం గౌరవాభిమానులన్నాయో తేలిపోయింది. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. అప్పుడంత వివాదం చెలరేగినా ములాయం మారితేనా? ఇప్పుడు మళ్లీ అమ్మాయిల రేప్ లపై నోరు పారేసుకున్నారు.
ములాయం సార్ అభిప్రాయం ప్రకారం గ్యాంగ్ రేప్ అన్న కాన్సెప్టే తప్పట. అసలు నలుగురు కలిసి అత్యాచారం చేయడం అన్నదే జరగదు అంటున్నారాయన. సాధారణంగా ఒక్కరే రేప్ చేస్తారని.. ఐతే ప్రతీకారం తీర్చుకోవడానికో మరో కారణంతోనో కావాలనే నలుగురు కలిసి రేప్ చేసినట్లు కల్పిస్తారని ములాయం అంటున్నాడు. నిజంగా నలుగురు రేప్ చేసినట్లయితే... ఒకడు రేప్ చేస్తుంటే మిగతా వాళ్లు చూస్తూ ఉంటారా? అంటూ దారుణమైన ప్రశ్న వేశారు ములాయం. అంటే గ్యాంగ్ రేప్ ఎలా జరగొచ్చు అని ఊహల్లోకి వెళ్లి తర్కం గురించి మాట్లాడుతున్నారన్న మాట ములాయం జీ. ఈ విషయంలో లాజిక్కులు తీసి ములాయం మాటల్ని ఖండించడం కూడా వృథా. సమాజం అంత భ్రష్టుపట్టిపోలేదింకా. మొత్తానికి ములాయం మాటల్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఎక్కడా గ్యాంగ్ రేప్ అన్నదే ఉండదన్నమాట. సంఘటన స్థలంలో ఎంతమంది ఉన్నా రేప్ చేసేది మాత్రం ఒక్కడేనని ఫిక్సవ్వాలన్నమాట. ఇలాంటి దౌర్భాగ్యపు నేతలకు ప్రభుత్వాల్ని నడిపే అధికారం ఇచ్చిన దేశం మనది.