Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ లో దారుణం: మ‌ర‌ద‌లిపై బావ అత్యాచారం..!

By:  Tupaki Desk   |   3 May 2020 8:11 AM GMT
లాక్‌ డౌన్‌ లో దారుణం: మ‌ర‌ద‌లిపై బావ అత్యాచారం..!
X
లాక్‌ డౌన్‌ తో ఎక్క‌డివారు అక్క‌డే బందిపోయారు. బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంది. దీంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లాక్‌ డౌన్ కొన్ని మంచి మార్పుల‌కు దారి తీస్తుండ‌గా మ‌రికొన్ని విప‌రీత ప‌రిణామాలకు దారి తీస్తోంది. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్‌ లో ఓ దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. ఇంట్లో ఉన్న మ‌ర‌ద‌లిపై క‌న్నేసిన బావ ఆమెపై బ‌ల‌త్కారం చేశాడు. భార్య చెల్లెలిపై అత్యాచారం చేశాడు. అయితే ఈ విష‌యాన్ని త‌న అక్క‌తో చెప్పుకోగా ఆమె త‌న భ‌ర్త చేసిన ప‌నిని స‌మ‌ర్ధించి త‌న చెల్లెలిని సర్దుకుపోమ‌ని స‌ల‌హా ఇచ్చింది. దీంతో ఆ చెల్లెలు అవాక్కైంది. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం పురులియా జిల్లాలో చోటుచేసుకుంది.

పురూలియా జిల్లాలో పెయింటింగ్ ప‌ని చేసుకుంటూ జీవిస్తున్న దత్తు ప్ర‌స్తుతం ఉపాధి లేక ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో భార్య జమునతో క‌లిసి ఉంటున్నాడు. అయితే వీళ్ల ఇంటికి అప్పుడప్పుడు జమున చెల్లెలు త‌రచుగా వ‌స్తుంటుంది. అయితే ఆమెపై ఎప్పట్నుంచో ద‌త్తు కన్నేశాడు. అదును కోసం చూస్తున్నాడు. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్ వ‌ల‌న అత‌డి కోరిక తీర్చుకునే అవ‌కాశం ల‌భించింది. లాక్‌డౌన్ స‌మ‌యంలోనే అక్క ఇంటికి వ‌చ్చి చెల్లెలు ఇరుక్కుపోయింది. నెల రోజులుగా అక్కాబావ‌తో క‌లిసి ఆ యువ‌తి ఉంటోంది. ఈ క్ర‌మంలో మ‌ర‌దలితో కోరిక తీర్చుకోవాల‌ని క‌సిగా ఉన్న ద‌త్తు స‌మ‌యం కోసం వేచి ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఓ రోజు రాత్రి మరదలిని తీసుకెళ్లి మరో గదిలో అత్యాచారం చేశాడు. దీంతో ఆ యువ‌తి నిర్ఘాంత‌పోయింది. ఈ విషయాన్ని తెల్లారి త‌న అక్కకు చెప్పింది.

అయితే ఈ విషయాన్ని అక్క తేలిగ్గా తీసుకుంది. ఈ క్ర‌మంలో భ‌ర్త దత్తుకు మ‌ద్ద‌తుగా మాట్లాడింది. నువ్వంటే ఆయ‌న‌కు ఇష్టమని, సర్దుకుపోవాల‌ని సలహా ఇచ్చింది. దీంతో చెల్లెలు షాక్‌కు గురైంది. దీంతో ఆ ఇంటి నుంచి తప్పించుకొని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు భార్యాభర్తలిద్దరిని అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.