Begin typing your search above and press return to search.
బాలికపై రేప్ కేసు.. ఎమ్మెల్యే కొడుకుని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
By: Tupaki Desk | 9 Jun 2022 6:37 AM GMTకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో రొమేనియా బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో మైనర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోమ్‌కు తరలించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పుప్పాలగూడ నివాసి సాదుద్దీన్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మిగతా ఐదుగురు మైనర్లనూ తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధాన నిందితుడు సాదుద్దీన్ ను పోలీసుల కస్టడీకి ఇస్తూ నాంపల్లిలోని పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అతడితో బాలిక పై గ్యాంగ్ రేప్ సీన్ ను రీకన్‌స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు. సాదుద్దీన్ ను ఘటనకు సంబంధించిన ప్రాంతాలైన ఆమ్నేషియా పబ్, కాన్సూ బేకరీ, అత్యాచారం జరిగిన జూబ్లీ హిల్స్ పెద్దమ్మగుడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లనున్నారు. తద్వారా సాదుద్దీన్ తోపాటు మిగతా మైనర్లు ఏ సమయంలో, ఎక్కడ, ఏం చేశారనేది పోలీసులు తెలుసుకోనున్నారు. అలాగే నిందితులు గతంలో ఇలా ఎవరినైనా చేశారా? వారికి నేర చరిత్ర ఉందా అనే అంశాలపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
అలాగే బాలికను గ్యాంగ్ రేప్ చేశాక నిందితులు వెళ్లిన ప్రాంతాలు, ఇన్నోవా దాచిన చోటుకూ అతడిని తీసుకువెళతామని పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా సాదుద్దీన్ తోపాటు మిగతా ఐదుగురు మైనర్ నిందితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు వారిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా జువైనల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన ఆరుగురిలో సాదుద్దీన్ ఒక్కడే మేజర్‌కాగా మిగతా వారంతా మైనర్లు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి ప్రభుత్వ వైద్యుల చేత పొటెన్సీ టెస్ట్ చేయించనున్నారు. ఈ పరీక్ష ద్వారా నిందితులకు లైంగిక పటుత్వం ఉందా? లేదా? అనేది స్పష్టమవుతోందని చెబుతున్నారు. చార్జిషీట్ దాఖలుకు ఇది కీలకం కావడంతో నిందితులకు పొటెన్సీ టెస్టు నిర్వహించడానికి కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
అలాగే బాలికపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో ఇన్నోవా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే తాము స్వాధీనం చేసుకున్నప్పుడు బ్లాక్ ఫిల్మ్ లేదని అంటున్నారు. దీంతో నిపుణుల సాయంతో గుర్తించాలని నిర్ణయించారు. ఫిల్మ్ ఉండి, తర్వాత తొలగించినట్టు తేలితే దానిపైనా కేసు నమోదు చేస్తారు.
మరోవైపు అత్యాచారానికి పాల్పడ్డ ఇన్నోవా వాహనం, బెంజ్ కారు ఎవరితో పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయో కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే దీనికోసం రవాణా శాఖ అధికారులకు వివరాలు ఇవ్వాలని సమాచారం పంపారు. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులపైనా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.