Begin typing your search above and press return to search.

ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు.. బీజేపీ సీనియర్ నేతపై రేప్ కేసు

By:  Tupaki Desk   |   18 Aug 2022 6:31 AM GMT
ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు.. బీజేపీ సీనియర్ నేతపై రేప్ కేసు
X
సంచలన ఆదేశాల్ని జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. బీజేపీ సీనియర్ నేతగా.. కాషాయ పార్టీలో మైనార్టీ నేతగా సుపరితుడైన షానవాజ్ హుస్సేన్ పై అత్యాచార కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. 2018లో తనపై షానవాజ్ హుస్సేన్ అత్యాచారం చేయాలని ఒక మహిళ ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. మహిళ ఫిర్యాదుపై మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది.అయితే.. బీజేపీ నేత షానవాజ్ మీద కేసు నమోదు చేసే విషయంలో పోలీసులు ఆసక్తి చూపటం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు.. 'బాధిత మహిళ కంప్లైంట్ తో బీజేపీ నేతపై కేసు నమోదు చేయటానికి పోలీసులు అయిష్టంగా ఉన్నారు.అతడి మీద కేసు నమోదు చేయాలి. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి' అంటూ స్పష్టమైన ఆదేశాల్ని ఢిల్లీ హైకోర్టు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే షానవాజ్ హుస్సేన్ తనను అత్యాచారం చేసిన వైనంపై కింది కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్బంగా పోలీసులు న్యాయస్థానంలో వినిపించిన వాదనను కింది కోర్టు తోసి పుచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదు చేయటంతో హైకోర్టు తాజాగా స్పందించింది.

2018 జనవరి ఢిల్లీకి చెందిన మహిళ ఒకరు బీజేపీ సీనియర్ నేత ఒకరు తనపై అత్యాచారం చేసినట్లుగా పేర్కొంటూ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అయితే.. ఈ కేసును వాపసు తీసుకోకుంటే తనను చంపేస్తానని ఆ బీజేపీ నేత బెదిరించినట్లుగా బాధిత మహిళ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన తాజాగా ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.