Begin typing your search above and press return to search.

క‌రోనాకు-మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై అత్యాచారాలకు లింకు.. ఎవ‌ర‌న్నారంటే!

By:  Tupaki Desk   |   23 Nov 2022 4:34 AM GMT
క‌రోనాకు-మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై అత్యాచారాలకు లింకు.. ఎవ‌ర‌న్నారంటే!
X
ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు పెరుగుతున్నాయి. మ‌హిళ‌ల‌పైనే కాదు.. బాలిక‌లపై కూడా అఘాయిత్యాలు పెరు గుతున్నాయి. ఇది ఏ రేంజ్‌లో అంటే.. ప్ర‌తి 11 నిమిషాల‌కు ఒక అత్యాచారం జ‌రుగుతోంద‌ట‌. అదేవిధంగా ప్ర‌తి 11 నిమిషాల‌కు ఒక మ‌హిళా హ‌త్య కూడా జ‌రుగుతోంద‌ట‌. ఇవేవీ పోసుకోలు క‌బుర్లు కావు. సాక్షాత్తూ ప్ర‌పంచం న‌మ్మే ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్ల‌డించిన అక్ష‌ర స‌త్యాలు. మ‌రి వీటికి కార‌ణం ఏంటో తెలుసా? కేవ‌లం క‌రోనా అట‌! ప్ర‌పంచాన్ని కుదిపేసిన క‌రోనా ప్ర‌బావంతో త‌ల్ల‌కిందులై న ఆర్థిక ప‌రిస్థితులు ఇలా మ‌హిళ‌ల‌పై అకృత్యాల‌కు, హ‌త్య‌ల‌కు దారితీస్తున్నాయ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి స్ప‌ష్టం చేసింది.

ఇంత‌కీ విష‌యం ఏంటి?ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల విషయంలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. భాగస్వామ్యులు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో ప్రతి 11 నిమిషాలకొక మహిళ లేకుంటే బాలిక.. హత్యకు/ అత్యాచానికి గురవుతోందని తెలిపింది. మహిళలపై హింస అంతకంతకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నెల 25న 'మహిళలపై హింస నివారణ దినం' సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్ర ఆందోళన కలిగించే నివేదిక‌ను తాజాగా బ‌య‌ట పెట్టారు. ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోందని లేదా అత్యాచారానికి గుర‌వుతోంద‌ని చెప్పారు.

కొవిడ్ 19 మహమ్మారి, ఇతర ఒత్తిడి కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులవ్వడం వల్ల ఆడవాళ్లు, ఆడపిల్లలపై శారీరక హింస, తిట్లు పెరిగాయని గుటెర్రస్‌ వివరించారు. ఇది తీవ్రమానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు జాతీయ కార్యాచరణను అమలు చేసి, ఈ దారుణాలకు అడ్డుకట్టవేయాలని కోరారు. ఢిల్లీలో జ‌రిగిన శ్రద్ధా వాకర్‌ దారుణ హత్య యావత్ ప్ర‌పంచాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిన సమయంలోనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఈ విషయాలను వెల్లడించ‌డం గ‌మ‌నార్హం.

ఆన్‌లైన్‌ ద్వారా మహిళలు, బాలికలు హింసను ఎదుర్కొంటున్నారని.. స్త్రీ ద్వేషంతో అసభ్యపదజాలంతో దూషణ, లైంగిక దాడులు, ఫొటోల మార్పిడి వంటి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు.. గుటెర్రస్‌ చెప్పారు. ఈ చర్యలన్నీ మహిళలు, బాలికల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను నిరాకరించడమేనని ఆయన చెప్పారు. మహిళలు, బాలికలపై హింసకు ముగింపు పలికే పరివర్తనకు సమయం ఆసన్నమైందని ప్రపంచ దేశాలకు గుటెర్రస్‌ పిలుపునిచ్చారు.

2026 నాటికి మహిళా హక్కుల సంఘాలు, ఉద్యమాలకు ప్రభుత్వాలు 50 శాతం నిధులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. మహిళ హక్కుల గళానికి ప్రభుత్వాలు మద్దతుగా నిలిచి..అంతా స్త్రీవాదులమనే సందేశాన్నిగర్వంగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. మ‌రి ఎన్ని దేశాలు చేస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.