Begin typing your search above and press return to search.

ఆ రేప్... టీడీపీ కార్యాలయంలో జరిగిందట!

By:  Tupaki Desk   |   1 Feb 2020 2:30 AM GMT
ఆ రేప్... టీడీపీ కార్యాలయంలో జరిగిందట!
X
కర్నూలు జిల్లా పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన అత్యాచారం ఘటన పెను కలకలమే రేపేలానే ఉంది. ఎందుకంటే... ఈ ఘటనలో అత్యాచారానికి గురైనది ఓ బాలుడు కాగా... ఘటన జరిగింది ఏపీలో ఇప్పుడు విపక్ష హోదాలో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయంలోనేనట. అంతేకాకుండా బాలుడి పై అసహజంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులు తెలుగు దేశం పార్టీకి చెందిన కార్యకర్తలేనట. మొత్తంగా ఎలా చూసినా కూడా ఈ రేప్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటుగా టీడీపీి పై చెరగని మచ్చ పడే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... కర్పూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం పరిధిలోని అవుకు మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ కార్యాలయంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు 14 ఏళ్ల బాలుడిపై సాముహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని చిత్రహింసలు పెట్టడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలు బుల్లెట్‌ రాజు - ప్రేమ్‌ కుమార్‌ - రాజుతో పాటు మరొకరని గుర్తించారు. వీరిపై సెక్షన్‌ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలుడిపై అత్యాచారం.. అది కూడా టీడీపీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలే చేశారని తేలడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ఘటనపై శుక్రవారం వైసీపీ చల్లా రామకృష్ణారెడ్డి - బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలోనే ఇలాంటి ఘటన జరడగం దారుణమని వారు మండిపడ్డారు. బాలుడిని డిన్నర్‌ పేరుతో పిలిచి నలుగురు టీడీపీ కార్యకర్తలు సామూహిక అత్యాచారం జరపడం వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. నిందితుల తల్లిదండ్రులు కూడా వారు చేసిన పనిని క్షమించరని చెప్పారు.బాలుడిపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. గతంలో కూడా నిందితులు పలువురిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీడీపీ నేతలు వెనకేసుకొచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.