Begin typing your search above and press return to search.
ఆవుపై అత్యాచారం ...సభ్యసమాజం తలదించుకునే సంఘటన !
By: Tupaki Desk | 9 Jan 2020 6:11 AM GMTమానవత్వానికి మాయని మచ్చలా నిలిచిన సంఘటన ఇది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఇది. దేశంలో మహిళలపై వరుస దాడులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పసిమొగ్గలు, పండు ముసలి వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్న కామ రాక్షుసులు ..చివరికి మూగజీవాలను సైతం వదలడం లేదు. కేరళలో ఓ ఆవుపై అత్యాచారానికి పాల్పడిన కామా పిశాచి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు చూస్తే .. పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌కు పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకి ఆవు ఉండేది. అయితే , ఆ ఆవు జనవరి 5 నుంచి అది కనిపించకుండాపోయింది. అప్పటినుండి ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఐతే బుధవారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో ఆవు మృత కళేబరం కనిపించింది.దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆవుపై లైంగిక దాడికి పాల్పడి చంపేశారని ఆరోపించాడు.
అతడి ఫిర్యాదు ఆధారం గా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఆవు కళేబరాన్ని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి పోలీసులకు నివేదిక అందించనున్నారు. ఐతే అసలు ఏం జరిగిందన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని మన్నార్‌కడ్ సీఐ తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతే నిజా నిజాలు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. ఆవుపై అత్యాచారం జరిగిన వార్త పాలక్కాడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.