Begin typing your search above and press return to search.
ఐదేళ్ల పసిమొగ్గపై అత్యాచారం.. చిన్నారి మృతి.. దారుణం చేసిందెవరంటే!
By: Tupaki Desk | 31 Oct 2022 3:54 AM GMTఐదేళ్ల చిన్నారి.. అప్పుడప్పుడే అడుగులు వేస్తూ.. అందరిలో కలిసిపోతూ.. ఆడుకునే చిన్నారి. అలాంటి పసిమొగ్గపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఒక దుర్మార్గుడు. ఆసుపత్రికి తీసుకువెళ్తానని నమ్మించి నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మర్మావయవాలపై దాడి చేశాడు. దీంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై.. ఆసుపత్రిలో మూడు రోజులు మృత్యు పోరాటం చేసి తనువు చాలించింది. ఈ దారుణానికి ఒడిగట్టింది స్వయానా మారు తండ్రి కావడం గమనార్హం. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో చోటు చేసుకున్న ఈ ఘాతుక ఘటన ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది.
పోలీసులు చెప్పిన కథనం మేరకు.. ఏం జరిగిందంటే!
డిచ్ పల్లికి చెందిన ఓ మహిళ తన భర్తతో వివాదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఈమెకు ఇద్దరు బిడ్డలు. అయితే, కాల క్రమంలో ఈ మహిళకు గోవిందరావు అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. ఇది సహజీవనానికి దారితీసింది. ఇద్దరు బిడ్డలతో కలిసి ఒకే ఇంట్లో గోవిందరావుతో ఆమె సహజీవనం చేస్తోంది.
అయితే.. గోవిందరావు మద్యానికి బానిస అవడంతోపాటు.. ఉన్నాది లక్షణాలు కూడా ఉన్నాయి. అయినా.. ఆమె అతనితోనే కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఒక రోజు చిన్న కుమార్తె(5)కు కాలికి గాయమైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తానని చెప్పిన గోవిందరావు.. అలానేచేశాడు.
ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆమె కాలికి కట్టుకట్టించాడు. అనంతరం వస్తూ వస్తూ.. చిన్నారిని నిర్జన ప్రాంతంలోకి తీసుకువెళ్లి.. అత్యాచారం చేశారు. ఈ క్రమంలో చిన్నారి మర్మావయవంపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి అపస్మారక స్థితిలొకి వెళ్లిపోయింది. విషయం తెలిసిన చిన్నారి తల్లి గోవిందరావును గద్దించగా.. నిజం చెప్పాడు. అయితే, ఈ విషయాన్ని బయటకు చెబితే.. మరో చిన్నారిపై కూడా అత్యాచారం చేస్తానని.. ఇద్దరినీ కలిసి చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆతల్లి మౌనంగానే ఉండిపోయింది.
ఇక చిన్నారిని వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యం చేసేందుకు వైద్యులు పోలీసు రికార్డు కోరగా.. ఆ తల్లి చిన్నారి గాయపడిందని ఫిర్యాదు చేసి.. కేసు పెట్టింది.
తర్వాత.. అదే ఆసుపత్రిలో మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి తుదిశ్వాస విడిచింది. వైద్యులు ఇచ్చిన పోస్టు మార్టం నివేదికలో చిన్నారిపై అత్యాచారం జరిగిందని, మర్మావయవం దెబ్బతిందని పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. పోస్కో సహా హత్య నేరం కింద కేసు నమోదు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.