Begin typing your search above and press return to search.
20వారాలు దాటితే చట్టం అంగీకరించదు!
By: Tupaki Desk | 24 July 2015 11:54 AM GMT14ఏళ్ల బాలికకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. వైద్యం నిమిత్తం ఆమెను ఒక వైద్యుడివద్దకు తీసుకుని వెళ్లగా... అతడు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు! వైద్యుడిని దేవుడితో పోలుస్తారు కానీ... ఈ వైద్యుడు కామాందుడు! ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది! ఈ ఘటనపై కేసు నమోదైంది! ఆ విషయాలన్నీ ఒకెత్తు అయితే ఆమెకు అతిపెద్ద సమస్య వచ్చింది. అయితే కోర్టుకూడా దానికి అంగీకరించలేదు, అనుమతి ఇవ్వలేదు!
అత్యాచారానికి గురైన ఈ బాలిక తండ్రి... తన కూతురికి అబార్షన్ చేయించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే దీనికి గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తర్వాత 20 వారాలు దాటిన తర్వాత భారతీయ చట్టం ఏమాత్రం అంగీకరించదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఆ బలిక గర్భం దాల్చి ఇపటికే 24 వారాలు పూర్తయ్యింది! దీంతో రేప్ బాదితురాలు అయినా అబార్షన్ కు చట్టం ఒప్పుకోలేదు! అయితే ప్రసవం పూర్తయ్యేవరకూ ఆమె మంచి చెడ్డులు చూసుకోవాలని, దానికి గానూ పరిహారంకోసం లక్షరూపాయలు చెల్లించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది!