Begin typing your search above and press return to search.
కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి అత్యాచారం.. ఫార్మా వ్యాపారి ఘాతుకం!
By: Tupaki Desk | 10 Jun 2022 5:22 AM GMTసోషల్ మీడియాలో పరిచయమైన ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్ కు చెందిన ఫార్మా వ్యాపారి కన్నేశాడు. సరదాగా కలుద్దామన్నాడు. ఆమెకు నమ్మకం కలిగేలా ప్రవర్తించాడు. స్టార్ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత బాధితురాలు నిలదీస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా వ్యాపారి ఢిల్లీలో ఈ దారుణానికి తెగబడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని ద్వారక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి పోలీసు బృందం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఉంటున్న నిందితుడి ఇంటికి చేరుకుంది. అయితే నిందితుడు తృటిలో తప్పించుకున్నాడు.
అత్యాచారం ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఫార్మా వ్యాపారి. ఆయనకు ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌తో పాటు ఢిల్లీలో కంపెనీ, కార్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 23లో ఓ ఇల్లు కూడా ఉంది. ఈయనకు డేటింగ్ యాప్ అయిన టిండర్ యాప్ లో ఢిల్లీ గురుద్వార సింగ్ సభ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పరిచయమైంది. ఈమెకు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తతో విబేధాలతో అతడి నుంచి విడిపోయి ఉంటుంది.
ఈ నేపథ్యంలో గత నెల్లో ఢిల్లీలో ఉన్న నిందితుడు మే 27న ఆమెకు ఫోన్ చేశాడు. ఆ రోజు రాత్రి సరదాగా కలుద్దామని చెప్పాడు. దీంతో సదరు వివాహిత తన సోదరితో వచ్చి ఓ హోటల్ లో అతన్ని కలిసింది. మరుసటి రోజు మరోసారి వివాహితకు ఫోన్ చేసి కలవాలని ఉందని నిందితుడు చెప్పాడు. దీంతో ఆమె మెట్రో రైల్‌లో ద్వారక స్టేషన్‌కు వచ్చింది. అక్కడ తన బీఎండబ్ల్యూ కారుతో వేచి ఉన్న మొహక్ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఆమెతో గుప్తా చాలా మర్యాదగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలికి నిందితుడు పై గురి కుదిరింది. దీంతో మే 30న ఓ స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లాడు.
హోటల్ గదిలోకి వెళ్లిన తర్వాత కూడా ఎంతో మర్యాదగా ప్రవర్తించిన గుప్తా కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. దీంతో బాధితురాలు మత్తులోకి జారుకుంది. దీంతో మత్తులో ఉన్న ఆమెపై పలుమార్లు గుప్తా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె మత్తు నుంచి తేరుకున్నాక భయపడొద్దని.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాడు.
ఇక అప్పటి నుంచి బాధితురాలు ఎన్నిసార్లు ప్రయత్నించినా నిందితుడు ఫోన్ ఎత్తడం లేదు. దీంతో ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు నిందితుడు పై అత్యాచారం తదితర సెక‌్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు.
జూన్ 9న నిందితుడు నిందితుడు కోసం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ వచ్చారు. బుధవారం సాయంత్రం అతని ఇంటిపై దాడి చేశారు. అయితే విషయం గమనించిన నిందితుడు ఇంటి వెనుక గోడ దూకి పరారయ్యాడు. దీంతో ఢిల్లీ పోలీసు బృందం నిందితుడు కోసం అతడిని పట్టుకోవడానికి అన్ని చోట్లా గాలింపు జరుపుతోంది.