Begin typing your search above and press return to search.

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రాపిడ్ కిట్లు .. సామాన్యులకి కుచ్చుటోపీ పెడుతోన్న కొందరు డాక్టర్లు !

By:  Tupaki Desk   |   4 Sept 2020 12:20 PM IST
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రాపిడ్ కిట్లు .. సామాన్యులకి కుచ్చుటోపీ పెడుతోన్న కొందరు డాక్టర్లు !
X
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి జిల్లా అధికారులు రాత్రి , పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతుంటే , దీన్ని అనుకూలంగా మార్చుకుని కొందరు ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్లు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కరోనా బాధితుల కోసం ప్రభుత్వం అందించే రాపిడ్ టెస్ట్ కిట్లను వివిధ మార్గాల ద్వారా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చీమకుర్తిలో అందరూ చర్చించుకుంటున్నారు. జిల్లా అధికారులు కూడా చీమకుర్తి లో ఉన్న కరోనా వ్యాధి ని దృష్టిలో పెట్టుకుని రేపటినుండి చీమకుర్తి లో ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం రోజురోజుకు కరుణ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతుండటంతో జిల్లా అధికారులు ఈ నిర్ణయం వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ తీరు పై అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈయన ఎవరి ఫోన్ ను ఎత్తి సమాధానం చెప్పని పరిస్థితి, వీరి పని తీరును పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా అక్కడికి రావడం కానీ , పరిశీలించడం గాని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో స్థానికంగా వ్యాధి తీవ్రత ఇంకా పెరుగుతుంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పని చేసిన డాక్టర్లు ఇక్కడ నుండి బదిలీ అవడంతో ఇక్కడ పనిచేస్తున్న చిన్న పిల్లల డాక్టర్ కి ఆ హాస్పిటలు బాధ్యతలు అప్పగించారు.

ఇదిలా ఉంటే చీమకుర్తి లో మూడు వేల రూపాయలు తీసుకుని ఆర్ ఎం పి .. డాక్టర్లు రాపిడ్ టెస్ట్ లు చేస్తున్నారు. వాస్తవానికి రాపిడ్ టెస్ట్ కిట్ ప్రైవేట్ వ్యక్తులకి ఎక్కడి నుండి వచ్చాయి అనేది పెద్ద చర్చకి దారితీస్తుంది. ఇదిలా ఉంటే చీమకుర్తి పట్టణంలో ఉన్న వారి కన్నా గ్రానైట్ క్వారీలలో పని చేస్తున్న వ్యక్తులకు ఎక్కువ మందికి రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మిగతా వారికి వి ఆర్ డి యల్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. క్వారీలలో ఉన్న వారితో ఇక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది లో లోపాయకారి ఒప్పందం చేసుకుని రాపిడ్ టెస్ట్ కిట్లు అమ్ముకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

అందువల్ల క్వారీలో ఉండేవారికి ఎక్కువగా రాపిడ్ టెస్ట్ లు చేస్తున్నారని , మిగతా ఎక్కువమంది కి వి ఆర్ డి యల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారం ఎక్కువమందికి తెలియకుండా అత్యంత గోప్యంగా జరుగుతుందని సమాచారం , జిల్లా అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపడితే చీమకుర్తి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న కిడ్స్ బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా కరోనాతో ప్రజలందరూ కొట్టుమిట్టాడుతుంటే ఈ సమయంలో కూడా చేతివాటం చూపించడం మంచిది కాదు.