Begin typing your search above and press return to search.

సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో-అల్లు అర్జున్

By:  Tupaki Desk   |   13 Nov 2021 12:43 PM GMT
సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో-అల్లు అర్జున్
X
ఐపీఎస్.. ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దెబ్బకు ర్యాపిడో సంస్థ దిగి వచ్చి అల్లు అర్జున్ యాడ్ నుంచి ఆర్టీసీ బస్సు సన్నివేశాలను తొలగించింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లీగల్ నోటీసులకు స్పందించిన ర్యాపిడో టీఎస్ ఆర్టీసీ బస్సులను చూపిస్తూ చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించింది.

ర్యాపిడో చిత్రీకరించిన ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసల్లా చాలా సమయం తీసుకుంటాయని.. ర్యాపిడో మాత్రం చాలా వేగంగా సురక్షితంగా ఉంటుందని అర్జున్ ఆ ప్రకటనలో చెప్పడం కనిపిస్తుంది.

ఈ ప్రకటనపై ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ప్రకటనలో నటించిన అల్లు అర్జున్ తోపాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు పంపారు. నోటీసులతో వెనక్కి తగ్గిన ర్యాపిడో ఆ సన్నివేశాలను తొలగించింది.