Begin typing your search above and press return to search.
రేప్ చేయటం తన హక్కుగా చెప్పేవాడట!
By: Tupaki Desk | 27 April 2018 4:23 AM GMTపోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు పాడు మాటలు ఆటోమేటిక్ గా వస్తుంటాయి. ఇందుకు ఆశారాం లాంటి దరిద్రపుగొట్టు ముసలోడు మినహాయింపు కాదు. కోట్లాది మంది భక్తులు నమ్మేస్తుంటు.. రెండు నిమిషాల సుఖం కోసం అతగాడు పడిన ఆరాటం.. చివరకు చచ్చే దాకా జైలుకే పరిమితమయ్యేలా చేసింది. హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న ఈ బాబా.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు తన కేసును తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు.
బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో చచ్చేదాకా జైల్లో ఉండేలా యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించిన వైనం తెలిసిందే. ఐదేళ్ల క్రితం ఒక బాలికను రేప్ చేసిన ఉదంతంలో ఆయనకు తాజాగా శిక్ష పడటం తెలిసిందే. ఈ కేసులో కొందరి సాక్ష్యం కీలకంగా మారింది. అలాంటి వారిలో రాహుల్ సచార్ వాంగ్మూలం అసారాం బాబుకు శిక్ష పడేలా చేసింది.
ఆసారాం మాజీ శిష్యుడు రాహుల్ కే సచార్ జోధ్ పూర్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో షాకింగ్ అంశాల్ని వెల్లడించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. రాజస్తాన్ లోని పుష్కర్.. హర్యానాలోని భివానీ.. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఆశ్రమాల్లో బాలికల్ని వేధించటం తాను చూసినట్లుగా ఆయన వెల్లడించేవారు. ఆశ్రమంలో అసారాం వెంట ముగ్గురు బాలికలు ఉండేవారని.. వారితో ఆశ్రమంలో తిరుగుతూ టార్చిలైట్ తో సైగలు చేసేవాడన్నారు.
అలా బాలికను ఎంపిక చేసిన తర్వాత.. ముగ్గురు బాలికలు కలిసి.. ఆ బాలికను అసారాం ఆశ్రమంలోకి తీసుకెళ్లేవారని చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన బాలికలకు గర్బస్రావాల్ని చేయించటంలో ఆ ముగ్గురు బాలికలే బాధ్యత తీసుకునేవారని చెప్పారు. ఒకసారి ఒక బాలికను వేధిస్తున్న సమయంలో అసారాంను తాను ప్రశ్నించినట్లు రాహుల్ చెప్పారు. దీనికి బదులుగా బ్రహ్మజ్ఞాని ఇలాంటివి చేయటం తప్పు కాదని బదులిచ్చినట్లు చెప్పారు.
అసారాం లైంగిక వేధింపుల్ని ప్రశ్నించినందుకు తనను ఆశ్రమం నుంచి బయటకు పంపేశారని.. ఆ తర్వాత దాడికి పాల్పడినట్లు చెప్పారు. లైంగిక సామర్థ్యం పెంచుకోవటం కోసం గంజాయితో పాటు ఇతర మత్తుమందుల్ని కూడా వాడేవాడని చెప్పారు. చేసిన పాపాలకు పరిహారం అన్నట్లుగా జీవితకాలం శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి అసారాంకు ఏర్పడింది. తప్పులకు శిక్ష పడటం ఖాయం. కాకుంటే.. ఒకరోజు అటో ఇటో అన్నది అసారాం ఉదంతంలో మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.