Begin typing your search above and press return to search.
అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో పిటిషన్!
By: Tupaki Desk | 7 Sep 2018 2:39 PM GMTతెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతోన్న కేసీఆర్ జోరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జాతీయ ఎన్నికల సంఘం ప్రకటించకముందే ..ఎన్నికలు ఎపుడు జరుగుతాయో కేసీఆర్ చెప్పడం ఏమిటని సీపీఐ మండిపడుతోన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి....ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మరో 9 నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తూ రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
మరో 9 నెలలు అధికారంలో ఉండే అవకాశమున్నా....కేసీఆర్ హడావిడిగా అసెంబ్లీని రద్దు చేశారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఏకపక్షంగా కేసీఆర్....తన స్వార్థం కోసం ...కుటుంబ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే ముందస్తుకు వెళుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీని రద్దు చేయడంపై హైకోర్టులో రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నపళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని తెలిపారు. 5 సంవత్సరాల కాలం పూయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని రాపోలు భాస్కర్ కోరారు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.