Begin typing your search above and press return to search.
పోచంపల్లి గ్రామానికి అరుదైన గుర్తింపు ... !
By: Tupaki Desk | 16 Nov 2021 2:55 PM GMTతెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ.. భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. డిసెంబర్ 2న స్పెయిన్ లోని మాడ్రిడ్ లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి అవార్డును ప్రదానం చేయనున్నారు.
భూదానోద్యమంతో పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా మారింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంపల్లి పేరు సంపాదించింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. పోచంపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నేసే చీరలు ఎంతో నాణ్యమైనవిగా పేరుపొందాయి. ఇది గ్రామమే అయినా సిల్క్ సిటీగా గుర్తింపు పొందింది. ఇప్పుడా గ్రామం గుర్తింపు అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం విశేషం. ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం 24వ మహాసభల్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేయనున్నారు.
పోచంపల్లి గ్రామానికి ప్రపంచ ఉన్నత పర్యాటక గ్రామంగా గుర్తింపు రావడం పట్ల కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పోచంపల్లి గ్రామ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడానికి కృషి చేసిన అధికారులను మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధాని మోదీ 'వోకల్ ఫర్ లోకల్' మంత్రం ద్వారా పోచంపల్లికి సంబంధించిన ప్రత్యేకమైన నేత శైలులు, నమూనాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. గ్రామ ప్రజల శ్రమ, స్వయం కృషి, అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు.
పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి ఎంపిక కావడానికి ఆ గ్రామస్తుల నైపుణ్యమే కారణం అని కొనియాడారు. ఈ అవార్డు కోసం భారత్ నుంచి 3 గ్రామాలను ఎంట్రీలుగా పంపించింది కేంద్ర ప్రభుత్వం. మేఘాలయలోని కోంగ్‌తాంగ్, మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్, తెలంగాణలోని పోచంపల్లి గ్రామాల పేర్లు ప్రతిపాదించింది. వీటిని పరిశీలించిన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రతినిధి బృందం పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది.