Begin typing your search above and press return to search.
రోహిత్ అరుదైన రికార్డ్ .. ఆ జాభితాలో చేరిక !
By: Tupaki Desk | 4 Sep 2021 7:31 AM GMTరోహిత్ శర్మ ... అందరూ హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. ఒక్కసారి క్రీజ్ లో కుదురుకుంటే డబుల్ సెంచరీలు కూడా దాసోహం అనాల్సిందే. ఇతర ఆటగాళ్లు సెంచరీ చేయాలంటే ఆపసోపాలు పడుతుంటే డబుల్ సెంచరీలు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఫార్మట్ ఏదైనా కూడా రోహిత్ మార్క్ షార్ట్స్ తో టీం కి విజయాన్ని అందిస్తుంటాడు. తాజాగా రోహిత్ శర్మ అరుదైన ఫీట్‌ను సాధించి దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ (56 బంతుల్లో 20 బ్యాటింగ్; 2 ఫోర్లు).. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
దీనితో ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాట్స్ మన్ గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్(24,208), విరాట్ కోహ్లీ(22,999), సౌరవ్ గంగూలీ(18,575), ఎంఎస్ ధోనీ(17,266), వీరేంద్ర సెహ్వాగ్(17,253), మహమ్మద్ అజారుద్దీన్(15,593) రోహిత్(15,009) కంటే ముందున్నారు. ఓవరాల్‌గా 15వేల మైలురాయి దాటిన జాబితాలో రోహిత్ 39వ స్థానంలో నిలిచాడు. 227 వన్డేల్లో 9,205 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. 43 టెస్ట్‌ల్లో 2935, 111 టీ20ల్లో 2864 రన్స్ చేశాడు. ఈ ఫీట్‌తో రోహిత్ మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగవంతంగా 15 వేల క్లబ్‌లో చేరిన ఐదో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో కోహ్లీ(333 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో ఉండగా.. సచిన్(356), ద్రవిడ్(368), సెహ్వాగ్(371) రోహిత్(397) కన్నా ముందున్నారు.
ఇదిలాఉంటే.. అత్యంత వేగంగా(తక్కువ ఇన్నింగ్స్‌లోనే) 15వేల పరుగులు పూర్తి చేసిన ఇండియన్ క్రికెటర్లలో రోహిత్ శర్మ 5వ స్థానంలో నిలిచాడు. 333 ఇన్నింగ్స్‌లలో 15 వేల పరుగులు పూర్తి చేసి విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఆ తరువాత స్థానంలో 356 ఇన్నింగ్స్‌తో క్రికెట్ లెజెండ్ సచిన్ ఉన్నాడు. ద్రవిడ్ 368 ఇన్నింగ్స్‌లలో 15 వేల పరుగులు పూర్తి చేయగా.. సెహ్వాగ్ 371, రోహిత్ శర్మ 397, గంగూలీ 400, అజారుద్దీన్ 434, ఎంఎస్ ధోనీ 452 ఇన్నింగ్స్‌ల్లో 15 పరుగుల మైలు రాయిని దాటారు.