Begin typing your search above and press return to search.

రేష్మిని వ్యభిచారంలోకి దింపింది ‘రాహులే’నంట

By:  Tupaki Desk   |   27 Nov 2015 4:43 AM GMT
రేష్మిని వ్యభిచారంలోకి దింపింది ‘రాహులే’నంట
X
అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన ‘కిస్ ఆఫ్ లవ్’ వ్యవస్థాపకుడు రాహుల్ నిజ స్వరూపాన్ని అతని భార్య రేష్మి గుట్టు విప్పింది. ఈ మధ్యన వారిద్దరిని ఆన్ లైన్ సెక్స్ రాకెట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ కేరళ జంట పలు విషయాలు పేర్కొన్నట్లు చెబుతున్నారు. అన్నింటికి మించి.. కిస్ ఆఫ్ లవ్ వ్యవస్థాపకుడి రాహుల్ వైఖరిపై అతడి భార్య రేష్మి చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన భర్తే తనను వ్యభిచారం రొంపిలోకి దింపినట్లుగా పేర్కొంది.

గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన రేష్మి బీటెక్ చదివే సమయంలో రాహుల్ మాటలతో అతనితో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమెను బలవంతం చేసిన వ్యభిచారం చేసేందుకు ఒప్పించాడు. అంతేకాదు.. తన అర్థనగ్న ఫోటోల్ని తీసి ఆన్ లైన్ లో పెట్టేవాడని.. వ్యభిచారం చేయాలని బలవంతం చేసే వాడని రేష్మి పేర్కొంది. తన వ్యభిచారానికి కారణం తన భర్తేనని ఆరోపిస్తున్న రేష్మి.. ఆన్ లైన్ లో తన పేరుతోనే రాహుల్ సమాధానాలు ఇచ్చేవాడని చెప్పింది. భర్త మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్న రేష్మి.. పోలీసులు పట్టుకోకముందే పోలీసుల వద్దకు వచ్చి తన భర్త చేస్తున్న వేధింపుల గురించి ఎందుకు ఫిర్యాదు చేయనట్లు..?