Begin typing your search above and press return to search.
బంగారాన్ని కాపాడిన ఎలుక...: ఎక్కడ పెట్టిందో తెలుసా..?
By: Tupaki Desk | 18 Jun 2022 1:30 AM GMTమీరు చదివింది నిజమే. కొన్ని ఎలుకలు బంగారాన్ని దొంగిలించాయి. అయితే అవి వేసుకొని అందంగా కనిపించడానికి కాదు.. అలాగని వాటిని అమ్మి డబ్బు సంపదించడానికీ కాదు.. కానీ బంగారం ఉన్న ఓ బ్యాగును మాత్రం తమ కలుగులోకి లాక్కెళ్లాయి. ఇలా ఎలుకలు బంగారం ఉన్న సంచిని లాక్కెళ్లడం సిసీ టీవీలో రికార్డయింది.
దాని ఆధారంగా పోలీసులు పరిశీలించారు. మొత్తానికి బంగారం ఉన్న బ్యాగును గుర్తించి బాధితురాలికి అందించారు. అసలు బంగారాన్ని ఎలుకలు ఎందుకు దొంగిలించాయి..? వాటికి బంగారంతో ఏంపని..? అయితే అసలు కథ వేరే ఉంది.. అదేంటో చదవండి..
ముంబైలోని గోరాగావ్ లో సుందరి అనే మహిళ జీవిస్తోంది. జీవితగమనంలో కొన్ని అప్పులయ్యాయి. వాటిని ఎలాగైనా తీర్చానుకుంది. ఏ దారి లేకపోవడంతో బంగారాన్ని కుదువపెట్టి లోన్ తీసుకోవాలని అనుకుంది. దీంతో ఓ రోజు తన బంగారాన్నంతా తన బ్యాగులో సర్దుకుంది.
అయితే ఇదే సమయంలో తన యజమాని ఇచ్చిన వడపావ్ ను కూడా అదే సంచిలో వేసింది. ఇలా తన సంచితో బ్యాంకుకు బయలుదేరింది. ఈ క్రమంలో తనకు ఓ యాచకురాలు ఎదురైంది. ఓ తల్లి, తన బిడ్డలతోకలిసి అడుక్కుంటున్న దృశ్యం తనను కదిలించింది. దీంతో ఆ తల్లీ బిడ్డలకు ఏదైనా చేయాలనుకుంది. తన దగ్గర వడపావ్ ఉండడంతో ఆ వడపావ్ ఉన్న సంచిని యాచకురాలికి అందించింది. అందులో బంగారం ఉన్న విషయాన్ని సుందరి మరిచిపోయింది.
కాసేపటికి గుర్తుకు తెచ్చుకున్న సుందరి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరగిందంతా చెప్పింది. దీంతో పోలీసులు యాచకురాలికి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఇంతలో యాచకురాలో ఆ బ్యాగును ఓపెన్ చేసి వడపావ్ ను తీసుకుంది. అయితే ఆ వడపావ్ పాడైపోవడంతో బ్యాగుతో సహా చెత్తబుట్టలో విసిరేసింది. ఎలాగోలా పోలీసులు యాచకురాలిని పట్టుకున్న తరుతవాత ఈ విషయాన్ని చెప్పింది. ఆ తరువాత బ్యాగు విసిరేసిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. అయితే అక్కడున్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు.
సీసీ కెమెరాల్లో బంగారం ఉన్న సంచిని ఎలుకలు కలుగులోకి తీసుకెళ్లాయి. వాస్తవానికి అందులో వడపావ్ ఉన్నందున అవి దాని కోసం తీసుకెళ్లాయి. అందులో బంగారం ఉన్న విషయం యాచకురాలితో సహా ఎవరూ గుర్తించలేదు. వెంటనే స్పాట్ కు వెళ్లిన పోలీసులు కలుగులో నుంచి మొత్తానకి బంగారం ఉన్న సంచిని బయటకు తీశారు.
అందులో బంగారం సేఫ్ గా ఉంది. దీంతో పోలీసులకు సుందరి థ్యాంక్స్ చెప్పింది. అయితే ఆ బంగారం విలువ రూ. 5 లక్షలు. ఆ బ్యాగు అటూ.. ఇటూ తిరిగి చివరికి సుందరికి చేరుకోవడంతో అమెది అదృష్టం అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.