Begin typing your search above and press return to search.

అది ఫేక్ న్యూస్‌..నమ్మకండి: రతన్‌ టాటా !

By:  Tupaki Desk   |   4 May 2020 5:30 PM GMT
అది ఫేక్ న్యూస్‌..నమ్మకండి: రతన్‌ టాటా !
X
ప్రముఖ పారిశ్రామిక వేత్త అయినటువంటి రతన్ టాటా మరోసారి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. దీనితో ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వివరణ ఇవ్వాల్సివచ్చింది. అంతేకాదు తాను చెప్పని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సంబధిత నకిలీ వార్తా కథనాన్ని షేర్ చేసిన రతన్ టాటా..ఇది కూడా నన్ను భయ పెడుతోంది. దీని గురించి నేను చెప్పలేదంటూ ట్వీట్ చేశారు. కేవలం తన ఫోటో ఉన్నంత మాత్రాన ఆ వ్యాఖ్యలు తాను చేసినట్టు కాదని ఆయన తెలిపారు.

ఇలాంటి నకిలీ వార్తలపై తనకు వీలైన సమయాల్లో స్పందిస్తానని చెప్పారు. కానీ వీటిపట్ల అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి వాటిని నిర్ధారించుకోవాలంటూ రతన్ టాటా మరోసారి సూచించారు. తన్ టాటా ఆదివారం సాయంత్రం వివరణ ఇచ్చిన ఈ ట్వీట్ వైరల్ అయింది. లక్షకు పైగా లైక్ ‌లు, వేలాది రీట్వీట్‌ లను సాధించింది. కాగా గత నెలలో కరోనావైరస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గురించి రతన్ టాటా అభిప్రాయం పేరుతో ఒక నకలీ వార్త బాగా వైరల్ అయింది. దీంతో స్వయంగా రతన్ టాటా ఆ అభిప్రాయం తనది కాదని, తాను అసలు అలా చెప్పలేదంటూ ట్విటర్ ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.