Begin typing your search above and press return to search.
గన్నవరానికి రతన్ టాటా సెల్ఫ్ డ్రైవింగ్
By: Tupaki Desk | 25 Aug 2015 5:37 AM GMTప్రముఖ పారిశ్రామికవేత్తగా రతన్ టాటా అందరికి సుపరిచితులే. కానీ.. ఆయన మంచి పైలెట్ అన్న విషయం కొద్ది మందికే తెలుసు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ కోసం సోమవారం విజయవాడకు వచ్చిన రతన్ టాటా విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలోని గ్రామాల్ని పెద్ద ఎత్తున దత్తత తీసుకోవటం తెలిసిందే.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన ప్రతినిధులతో విజయవాడకు వచ్చిన రతన్ టాటా.. ప్రత్యేక విమానంలో వచ్చారు. గన్నవరానికి ఆయన పైలెట్ గా వ్యవహరిస్తూ రావటం ఒక విశేషం. మొత్తం పదమూడు మంది కూర్చునే వీలున్న విమానాన్ని ముంబయి నుంచి సెల్ప్ డ్రైవింగ్ చేసుకుంటూ రతన్ టాటా గన్నవరానికి చేరుకున్నారు.
పైలెట్ సీట్ లో కూర్చున్న రతన్ టాటా.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం తిరిగి గన్నవరానికి చేరుకున్న ఆయన.. విమానంలో ని పైలెట్ సీట్ లో కూర్చోవటం.. ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన నేతలు ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. పైలెట్ సీట్ లో కూర్చున్న రతన్ టాటా.. సీటు బెల్ట్ కూడా పెట్టుకోకుండా రయ్యిమంటూ ఎగిరిపోవటం విశేషం. రతన్ టాటాతో పాటు.. మరో తొమ్మిది మంది వచ్చినట్లుగా చెబుతున్నారు. అంత పెద్ద వయసులో.. అంత ఉన్నతస్థానంలో ఉండి కూడా విమానం నడపాలన్న అభిలాష రతన్ టాటాకు ఉండటం కాస్తంత ఆసక్తి కలిగించే అంశమే కదూ.