Begin typing your search above and press return to search.
ఇన్ స్టాగ్రాం ని షేక్ చేస్తున్న రతన్ టాటా ?
By: Tupaki Desk | 24 Jan 2020 9:51 AM GMTప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా తాజాగా ఇన్ స్టాగ్రాంలో తన ఖాతాని ఓపెన్ చేసి తరచూ వినూత్న పోస్ట్ లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియా మెళకువలను పూర్తిగా అవపోసన పట్టిన రతన్ టాటా థ్రోబ్యాక్ థర్స్ డే అంటూ గురువారం పోస్ట్ చేసిన న్యూ పోస్ట్ ఇప్పుడు ఇన్ స్టాగ్రాంను షేక్ చేస్తోంది.
2 ఏళ్ల రతన్ టాటా.. తాను యువకుడి గా ఉన్నా సమయం లో లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పటి ఫోటో ను తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసారు. ఈ ఫోటోకి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆయన రతన్ టాటానేనా అంటూ పోస్టులు పెడుతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు రతన్ టాటా బాలీవుడ్ హీరోకు తీసిపోని రీతిలో ఉన్నాడని తన సహచరుల నుండి కామెంట్లు, షేర్లు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి.
ఇక మరో నెటిజన్ రతన్ జీ మీ కళ్లల్లో మెరుపు కన్పిస్తోందని మెచ్చుకున్నారు. ఇక ఫోటో పోస్ట్ చేస్తూ రతన్ టాటా ఇచ్చిన క్యాప‍్షన్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంది. తాను లాస్ ఏంజెల్స్ నుంచి భారత్‌కు వచ్చే ముందు నాటి ఈ ఫోటోను బుధ వారమే పోస్ట్ చేయాలనుకున్నా థ్రోబ్యాక్ థర్స్‌డే గురించి విని ఇప్పుడు పోస్ట్ చేశానని రతన్ టాటా క్యాప్షన్‌లో ప్రస్తావించారు. అమెరికాలోని జోన్స్ అండ్ ఎమ్మాన్స్ అనే సంస్థలో కొంతకాలం పనిచేసి 1962లో భారత్ కు తిరిగి వస్తోన్న సమయంలో ఈ ఫొటో తీయించుకున్నానని రతన్ టాటా తెలిపారు.