Begin typing your search above and press return to search.

కరోనా చికిత్సకు రేటు ఫిక్స్ ... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్ !

By:  Tupaki Desk   |   1 May 2021 9:30 AM GMT
కరోనా చికిత్సకు రేటు ఫిక్స్ ... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్ !
X
కరోనా వైరస్ రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం ఫీజులు నిర్ణయం తీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, యాజమాన్యాలతో చర్చించి ధరలు నిర్ధారించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స ధరలను ఖరారు చేస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రులకు ఒక ధర, అక్రిడేషన్ లేని హాస్పిటల్స్ కు మరో ధరను నిర్ణయించింది.

ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రి కరోనా వైరస్ రోగిని అడ్మిట్‌ చేసుకోవాల్సిందేనన్నారు. అడ్మిషన్‌ సమయంలో ముందస్తు సొమ్ము కు డిమాండ్‌ చేయకూడదన్నారు. NABH అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రులు నం క్రిటికల్ కేర్ కోసం రూ. 4000, అక్రిడేషన్ లేని ఆసుపత్రులు రూ. 3600 వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, NABH అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రులు, లేని ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స రేట్ల చూస్తే…NABH అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రుల్లో రేట్లు ( ఒక రోజుకు)…
నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) – రూ. 4000
నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ తో) – రూ. 6500
ఐసీయూలో చికిత్స అందిస్తే – రూ. 12,000
క్రిటికల్ కేర్ (ఐసీయూ + వెంటిలేటర్) – రూ. 16,000

అక్రిడేషన్ లేని ఆసుపత్రుల్లో రేట్లు ఇలా(రోజుకు)…
నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) – రూ. 3600
నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ తో) – రూ. 5850
ఐసీయూలో చికిత్స అందిస్తే – రూ. 10,800
క్రిటికల్ కేర్ (ఐసీయూ + వెంటిలేటర్) – రూ. 14,400

అలాగే సీటీ స్కాన్‌ కు రూ.3 వేలకు మించి తీసుకోకూడదని ప్రభుత్వం పేర్కొంది. రెమ్‌ డెసివిర్‌ ఇంజక్షన్‌ కు ఒక్కోదానికి రూ.2,500, తోసిజుమాంబ్‌ ఇంజక్షన్‌ కు రూ.30 వేలు తీసుకోవచ్చు. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్, జిల్లా వైద్యాధికారులు, తదితరులకు కల్పించారు. కాగా, ఈ ధరల పట్టికను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రదర్శించాలని ఏపీ సర్కార్ వెల్లడించింది.