Begin typing your search above and press return to search.
ఆ గ్రామాస్తులను పెళ్లాడిన బాలీవుడ్ హీరోయిన్స్!
By: Tupaki Desk | 1 Sep 2016 5:43 AM GMTపెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేటప్పుడు ఆయా హీరోయినల్ పేర్లు - ఫోటోలు వాడతారు. లేదా ఆయా హీరోయిన్స్ నటించిన సినిమాల ప్రమోషన్స్ విషయంలో బలంగా వాడతారు కానీ.. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఒక మేధావి మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ ని మరీదారుణంగా వాడేశాడు. అంతేనా.. వారికి పెళ్లిల్లు కూడా చేసేశాడు. వారికి ఏడాదికి వచ్చే ఆదాయం రూ.11వేలుగా నిర్ధారించేశాడు. ఈ రేంజ్ లో ఉన్న ఇతగాడి తెలివితేటల సంగతి పూర్తిగా తెలుసుకోవడానికి విషయంలోకి ఒకసారి వెళ్దాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి జిల్లా మీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ గంజ్ అనే ప్రాంతంలో రేషన్ డీలర్ కు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడమే ఆలస్యం ఇంకెవరూ దొరకనట్లు బాలీవుడ్ హీరోయిన్స్ పేరుతో కొత్త కార్డులు సృష్టించేశాడు. వీరికి ప్రతీనెలా రేషన్ సరుకులుకూడా ఇచ్చేస్తున్నాడు. ఈ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్స్ దీపిక పదుకునే - జాక్విలిన్ ఫెర్నాండేజ్ - సోనాక్షి సిణా - రాణిముఖర్జీ మొదలైన తారల పేర్లతో ఆ గ్రామంలో రేషన్ కార్డులు మజూరయిపోయాయి.. వారి వారి ఆదాయం ఏడాదికి పదకొండు వేల రూపాయలుగా కూడా ఆ కార్డుల్లో పొందుపరచడం జరిగింది. అంతేనా.. ఈ తారలంతా అక్కడి గ్రామస్తులనే వివాహం చేసుకున్నారని కూడా సదరు రేషన్ డీలర్ రికార్డుల్లో పేర్కొన్నాడు. దీంతో విషయం బయటకు పొక్కడంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీచేశారు.
పేదలకు చౌక ధరల్లో ఆహార పదార్థాలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజా పంపిణీ వ్యవస్థను కొందరు కిలాడీలు ఏరేంజ్ లో మోసాలు చేసి, దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఈ సంఘటన చిన్న ఉదాహరణ మాత్రమే.