Begin typing your search above and press return to search.

మోడి-కేజ్రీవాల్ మధ్య ‘రేషన్’ వివాదం

By:  Tupaki Desk   |   7 Jun 2021 11:30 AM GMT
మోడి-కేజ్రీవాల్ మధ్య ‘రేషన్’ వివాదం
X
పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీతోనే కాదు తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కూడా నరేంద్రమోడికి వివాదం మొదలైంది. మమత లాగే మోడికి, కేజ్రీవాల్ కు కూడా ఏమాత్రం పడదు. కాకపోతే కేజ్రీవాల్ బెంగాల్ సీఎం మమత అంత దూకుడు మనిషి కాదు కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అలాంటి కేజ్రీవాలే తాజాగా మోడిపై మండిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే లాక్ డౌన్ సమయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) అడ్డుకున్నారు. కేంద్రప్రభుత్వం అనుమతిలేకుండా పథకాన్ని ఎలా ప్రారంభిస్తారంటు ఎల్జీ అడ్డుచెప్పటంపై కేజ్రీవాల్ మండిపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా పిజ్జా డెలవరీలను అనుమతించిన కేంద్రప్రభుత్వం రేషన్ డోర్ డెలవరీని మాత్రం ఎందుకు అడ్డుకుందో సమాధానం చెప్పాలని నిలదీశారు.

కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే అన్న ఎల్జీ నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తున్నారు. నిజానికి పథకం అమలుకు కేంద్రప్రభుత్వం అనుమతి అవసరమే లేదన్నారు. అయినా సరే ఎందుకన్నా మంచిదని ఇప్పటికి ఐదుసార్లు కేంద్రం నుండి అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు. కేంద్రానికి చెప్పి పథకం ప్రారంభించిన తర్వాత కూడా తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వచ్చేస్తుందో అన్న ఆందోళనతోనే పథకాన్ని కేంద్రం నిలిపేసిందంటున్నారు కేజ్రీవాల్.

మొత్తం మీద రేషన్ తీసుకునే లబ్దిదారులు ఢిల్లీలో 70 లక్షల మందున్నారట. పథకాన్ని నిలిపేసిన కారణంగా ఇపుడు 70 లక్షలమంది ఇబ్బందులు పడుతున్నారంటూ కేంద్రంపై కేజ్రీవాల్ మండిపడుతున్నారు. నిజానికి రేషన్ అనేది ఇటు రాష్ట్రానిదీ కాదు అటు కేంద్రానిదీ కాదని చెబుతున్న కేజ్రీవాల్ పథకం అమలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టారు. మరి మోడి ఏమంటారో చూడాలి.