Begin typing your search above and press return to search.
ఫిబ్రవరి 1 నుంచి రేషన్ డోర్ డెలివరీ: జగన్
By: Tupaki Desk | 4 Jan 2021 3:15 PM GMTఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాలన, సంక్షేమ పథకాల అమలులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలనను తెచ్చిన జగన్....వలంటీర్ల వ్యవస్థతో పాలనలో కొత్త ఒరవడి సృష్టించారు. గతంలో పెన్షన్ కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో పడిగాపులకు జగన్ మంగళం పాడారని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేషన్ షాపుల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయకుండా ఉండేందుకు ఇంటివద్దకే రేషన్ సరుకులు అందించాలని జగన్ సంకల్పించిన సంగతి తెలిసిందే. అయితే, అనివార్య కారణాలు, కరోనా వల్ల వాహనాల ఏర్పాటులో జాప్యం నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటింటికి రేషన్ సరుకుల సరఫరాపై నేడు ఏపీ సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేయబోతున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, నూతన సీఎస్ ఆదిత్యనాథ్, సంబంధిత శాఖ సీనియర్ అధికారులతో నేడు భేటీ అయిన జగన్ ఈ కీలక నిర్ణయం వెల్లడించారు. రేషన్ డోర్ డెలివరీ అంశంతోపాటు ధాన్యం సేకరణ మార్గదర్శకాలను కూడా సీఎం జగన్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన15 రోజుల్లోగా రైతులకు నగదు చెల్లింపులు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను జగన్ ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలుంటే సంక్రాంతిలోపు చెల్లించాలని సూచించారు. కాగా, జనవరి నెల మూడో వారంలో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించబోతున్నారు. అదే రోజున 10 కిలోల బియ్యం సంచులను ఆవిష్కరించనున్నారు. రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 9,260 వాహనాలను సిద్ధం చేసింది. ఆ వాహనాలలో తూకం యంత్రాలను కూడా ఏర్పాటు చేసింది.