Begin typing your search above and press return to search.

ఆయన దెబ్బకు పెద్దన్న చేయి వంగిపోయింది

By:  Tupaki Desk   |   23 March 2016 6:13 AM GMT
ఆయన దెబ్బకు పెద్దన్న చేయి వంగిపోయింది
X
దశాబ్దాల వైరం తర్వాత.. చారిత్రక పర్యటనగా అందరూ అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడి క్యూబా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. 88 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒకరు క్యూబా దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి అద్భుతం స్వాగత సత్కారాలు లభించకపోవటం గమనార్హం. అంతేకాదు.. ఇరు దేశాలకు చెందిన అధినేతలు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశం సైతం అరకొరగా సాగటమే కాదు.. దీని చివర్లో చోటు చేసుకున్న సంఘటన చూసిన వారు అవాక్కయ్యే పరిస్థితి.

క్యూబా అధ్యక్షుడి చొరవ.. ఆయన ధైర్యం కారణంగా ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడి చేయి వంగిపోవటం విశేషం. ఈ విచిత్రమైన ఉదంతం ఎలా చోటు చేసుకుందంటే.. ఇరు దేశాల అధినేతల మీడియా సంయుక్త సమావేశం జరుగుతుండగా.. అర్థాంతరంగా ముగించేసిన రౌల్ కాస్ట్రోను ఒబామా వెన్ను తట్టబోయారు.

ఊహించని విధంగా రౌల్ కాస్ట్రో ఒక్క ఉదుటన ఒబామా యేతిని మణికట్టు వద్ద పట్టుకొని.. మెలి తిప్పినట్లుగా చేస్తూ ఇరువురి చేతిని ఎత్తారు. నిజానికి ఇరువురు అధినేతలు చేతులు ఎత్తే దానికి భిన్నంగా వీరి ఫోజు ఉండటం గమనించొచ్చు. అంతేకాదు.. ఈ సందర్భంగా పెద్దన్నలాంటి ఒబామా చేయి వాలిపోతే.. కాస్ట్రో చేయి మాత్రం నిలబడి ఉండటం గమనార్హం. ఈ సీన్ చూస్తే.. అమెరికా మీద తనకున్న ఆగ్రహాన్ని కాస్ట్రో ఒబామా పర్యటనలో దాచుకోలేని తీరు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.