Begin typing your search above and press return to search.

రేవ్ పార్టీ : అన్ ప్రొఫ‌ష‌నల్ పోలీసింగ్ అంటే ?

By:  Tupaki Desk   |   4 April 2022 2:31 AM GMT
రేవ్ పార్టీ : అన్ ప్రొఫ‌ష‌నల్ పోలీసింగ్ అంటే ?
X
డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి మరో ఇంట్ర‌స్టింగ్ అప్టేడ్ వ‌చ్చింది. ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు చెబుతున్న ప్రకారం..పోలీసుల రాడిస‌న్ హోట‌ల్ లో ఉన్న ప‌బ్ పై దాడి చేసి, అరెస్టు చేశారు కానీ అనుమానితుల నుంచి బ్ల‌డ్ శాంపిల్స్ తీసుకోలేద‌ని చెప్పారు.

అదేవిధంగా బాధితుల్లో చాలా మంది డ్ర‌గ్ ఎడిక్ట్ కాని వారు కూడా ఉన్నార‌ని ఆయ‌న చెబుతున్న వివ‌రం. విదేశీ యువ‌తులు ఎక్కువ మంది అన్ ప్రొఫ‌ష‌న‌ల్ పోలీసింగ్ అంటూ మండిప‌డ్డార‌న్న‌ది ఆయ‌న చెబుతున్న మ‌రో వివ‌రం. ప్ర‌ధాన మీడియాలో వెలుగు చూసిన క‌థ‌న సారం సారాంశం ఎలా ఉన్నా వేళ త‌ప్పి నియ‌మం త‌ప్పి రూల్స్ ను వాయిలేట్ చేస్తూ లేట్ నైట్ పార్టీల‌కు ఎలా అనుమ‌తించాలి? పోలీసులు.. అంటే పోలీసులు త‌మ పని తాము చేసినా త‌ప్పేనా?

అవును బంజారాహిల్స్ ఠాణాకు వ‌చ్చిన చాలా మంది యువ‌తులు చాలా అస‌హ‌నానికి లోన‌య్యార‌ని కూడా తెలుస్తోంది. అంటే ఒంటి గంట‌న్న‌ర త‌రువాత ఇంకా చెప్పాలంటే వేళ కాని వేళ‌ల్లో పోలీసులు అనుమ‌తి లేని స‌మ‌యాల్లో తాగ‌డం తూల‌డం త‌ప్పు అని పోలీసులు చెప్పినా విన‌కుండా డ్యూటీలో ఉన్న ఆఫీస‌ర్ల‌ను బండ బూతులు తిట్టార‌ని కూడా తెలుస్తోంది.

అస‌లు నిహారికా కూడా హాయిగా ఫోన్లో మాట్లాడుకుంటోంది. అరెస్టు స‌మ‌యంలో పోలీసులు ఆమె సెల్ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. ఆమెదే కాదు రాహుల్ సిప్లిగంజ్ అనే సింగ‌ర్ సెల్ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. అంటే దీనిపై త‌దుప‌రి విచార‌ణ ఉంటుందా ? ఉండ‌దా? స‌రైన వ్యూహం లేకుండానే పోలీసులు వీరిని అరెస్టు చేశార‌ని కొంద‌రు అంటున్నారు.

వ్యూహం అంటే ఏంటి? వీళ్ల‌ను ఎందుకు వైద్య ప‌రీక్షల‌కు తీసుకు వెళ్ల‌లేదు. కేసులు న‌మోదు చేయ‌కుండా నోటీసులు ఇవ్వ‌డం ఏంటి ఇవి కూడా ప‌లు సందేహాలకు ఆన‌వాలుగా నిలుస్తున్నాయి. ఏదేమ‌యినా పోలీసులు డ్యూటీ చేశారు.కానీ అన్ ప్రొఫ‌ష‌న‌ల్ మేన‌ర్ లో చేశారా లేదా అన్న‌ది త‌రువాత.

వీళ్లు తాగారు తూలారు వీళ్లు అన్ ప్రొఫ‌ష‌న‌ల్ గా ఉన్నారా లేదా అన్న‌ది కూడా త‌రువాత విచార‌ణ లో తేలాల్సిన విష‌యాలే ! ఏమ‌యిన‌ప్ప‌టికీ డ్యూటీ ఆఫీస‌ర్ల‌ను వీళ్లెలా తిడ‌తారు? అదేవిధంగా అరెస్టు స‌మ‌యంలో పోలీసులు నిహారికాకు కానీ ఇత‌రుల‌కు కానీ సెల్ఫోన్లు ఎలా అనుమ‌తిస్తారు? ఇవ‌న్నీ తేలాల్సిందే ! కావాలి ప్ర‌శ్న‌ల‌కే జ‌వాబులు.