Begin typing your search above and press return to search.
దీక్షను కూడా తప్పుపడితే దిగజారుడుతనమే!
By: Tupaki Desk | 10 Sep 2015 4:51 AM GMTరాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎవ్వరూ ఏ పనీ చేయరు? అంతటి త్యాగమూర్తులు ప్రస్తుతం మన రాజకీయాల్లో ఎవరూ లేరు! అలాంటప్పుడు అంతిమంగా రాజకీయ ప్రయోజనం తప్పకుండాఉంటుంది గానీ.. ప్రస్తుతం చేస్తున్న పనిలో మంచి చెడులను మాత్రమే బేరీజు వేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరం అని అనుకుంటున్న తరుణంలో.. విపక్షనేత జగన్మోహనరెడ్డి దానికోసం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటూ ఉంటే.. మంత్రి రావెల కిశోర్ బాబు.. ఆ దీక్షను కూడా ఆడిపోసుకోవడం మరీ హేయంగా ఉంది.
జగన్ చేసే దీక్షలతో ప్రయోజనం ఏమిటి? అని రమేష్ బాబు ప్రశ్నిస్తున్నారు. జగన్ చేసేవన్నీ రాక్షస దీక్షలట! ఏ రకంగా వాటిని రాక్షసదీక్షలంటూ ఆయన కొత్త పేరు పెట్టగలిగారు? సరే మంచిదే రావెల చెబుతున్నట్లుగా అవి రాక్షస దీక్షలనీ.. చంద్రబాబు చేసిఉంటే గనుక.. దేవతా దీక్షలని కూడా అనుకుందాం. జగన్ దీక్షతో ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి. ఆమాత్రం కూడా అవగాహన లేకుండా ఒక వ్యక్తి రాష్ట్రానికి మంత్రి అయిపోతే ఎంత ఘోరంగా ఉంటుందో జాలిపడడం తప్ప మనమేం చేయలేం.
ఒక దీక్ష జరగడం వల్ల.. ఆ అంశానికి సంబంధించి ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆ అంశానికి మద్దతు ఇవ్వగల ప్రజల సంఘీభావం దీక్షకు అందుతుంది.. ప్రజల్లో ఆ అంశం ఒక వేడిని పుట్టిస్తుంది. అలా జరిగితే.. అప్పుడు నిరంకుశంగా వ్యవహరించే ప్రభుత్వాల వైఖరిలో కూడా ఒక కదలిక వస్తుంది.
ప్రజాస్వామ్యంలో దీక్షలకు, ఉద్యమాలకు ఉండే ప్రాధాన్యం తెలుసుకోకుండా విపక్ష నేత చేస్తున్న దీక్ష గనుక.. దాన్ని తిట్టిపోయడమే తన బాధ్యత అని ఈ మంత్రిగారు ఫిక్స్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ జగన్ దీక్ష వలన ప్రయోజనం లేదని రావెల భావిస్తున్నారే అనుకుందాం.. మరి ఏం చేస్తే ప్రయోజనం ఉంటుందో ఆయనే సెలవివ్వాలి. ''సామరస్యంగా సాధించుకుందాం'' అని వాళ్ల నాయకుడిలాగా మెరమెచ్చు మాటలు చెప్పడం కాదు. ఒక డెడ్ లైన్ పెట్టి.. ఆలోగా ఏం చేస్తే ప్రత్యేకహోదా వస్తుందో రావెల చెప్పగలగాలి. తనకు ఏమీ చేతకానప్పుడు.. ఏమీ చేయకుండా కూర్చోడం కంటె.. ఏదో ఒక ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలను చూసి ఇలా ఏడవడం భావ్యం కాదు.
రాజకీయంగా జగన్ ను ఎదుర్కొనదలచుకుంటే.. తెదేపా నేతలు తమకు బాగా అలవాటైన ఆయన అవినీతి గురించి అక్రమాల గురించి.. ఎన్నయినా తిట్టవచ్చు పర్లేదు. కానీ.. ప్రత్యేకహోదా కోసం చేసే దీక్షను కూడా నీరుగార్చాలని చూస్తే చాలా దిగజారుడుతనంగా ఉంటుంది.