Begin typing your search above and press return to search.

ఎస్సీ - ఎస్టీల కోసం రావెల దీక్ష!

By:  Tupaki Desk   |   5 July 2018 9:20 AM GMT
ఎస్సీ - ఎస్టీల కోసం రావెల దీక్ష!
X

ఎస్సీ -ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కొంద‌రు దుర్వినియోగం చేస్తున్నార‌ని - ఆ చ‌ట్టాన్ని సవరిస్తూ తక్షణ అరెస్టులను నిషేధించాలని కొద్ది రోజుల క్రితం సుప్రీం తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎస్సీ -ఎస్టీల భ‌ద్ర‌త‌కు ఆ చ‌ట్టం తూట్లు పొడిచేలా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డిన విష‌యం విదిత‌మే. ఆ తీర్పున‌కు వ్య‌తిరేకంగా గ‌తంలో చేప‌ట్టిన `భార‌త్ బంద్` హింసాత్మ‌కంగా మారి 10 మంది చ‌నిపోవ‌డం దేశవ్యాప్తగా క‌ల‌క‌లం రేపింది. ఈ నేప‌థ్యంలో తాజాగా - ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పున‌కు నిరసనగా ఈ నెల 23న దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు తెలిపారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న పార్లమెంట్ సమావేశాలలో అట్రాసిటీ చ‌ట్టాన్ని బ‌లోపేతం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాను దీక్ష చేప‌ట్టిన‌ట్లు రావెల తెలిపారు. సుప్రీం తీర్పు వల్ల అట్రాసిటీ చట్టం కోరలు పీకిన పులి లాగా బలహీన పడిందని రావెల అన్నారు. ఆ తీర్పుతో దేశ వ్యాప్తంగా దళితులలో అభద్రతభావం ఏర్పడిందన్నారు. ఇటీవ‌లి కాలంలో దేశంలోని ప‌లు రాష్ట్రాల‌తోపాటు ఏపీలో కూడా దళితులపై వరుస దాడులు జరుగడం శోచ‌నీయ‌మ‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీ -ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కొంద‌రు దుర్వినియోగం చేస్తున్నార‌ని - ఆ చ‌ట్టాన్ని సవరిస్తూ తక్షణ అరెస్టులను నిషేధించాలని కొద్ది రోజుల క్రితం సుప్రీం తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో, ఆ తీర్పున‌కు వ్య‌తిరేకంగా కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్త బంద్ న‌కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. `భార‌త్ బంద్` హింసాత్మ‌కంగా మారి 10 మంది చ‌నిపోవ‌డం దేశవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ నేప‌థ్యంలో ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతూ కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఉత్తర్వులపై పునరాలోచించాలని సుప్రీంను కేంద్రం కోరింది. అయితే, ఆ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఎస్సీ - ఎస్టీల‌ హక్కుల పరిరక్షణకు తాము 100 శాతం కట్టుబడి ఉన్నామని కేంద్రానికి సుప్రీం తెలిపింది. దళితులపై వేధింపులకు పాల్పడే వారికి క‌ఠిన శిక్ష‌లు విధిస్తామ‌ని - సుప్రీం తెలిపింది. గ‌తంలో జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై స్టే విధించాలన్న కేంద్రం వాదనను సుప్రీం తోసిపుచ్చింది.