Begin typing your search above and press return to search.
రావెల సుశీల్ కేసు వెనక జగన్ హ్యాండ్?
By: Tupaki Desk | 6 March 2016 7:37 AM GMTవైసీపీ అధ్యక్షుడు జగన్ కు దమ్ముంటే తనను రాజకీయంగా ఎదుర్కొవాలని ఏపీ మంత్రి రావెల సవాల్ విసిరారు. ఇటీవల అమరావతి భూ దందాలో తనపై విమర్శలు చేయడం.. తాజాగా తన కుమారుడిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం వంటివాటి వెనుక జగన్ కుట్ర ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సాక్షి ఛానెల్ లో సిసి ఫుటేజ్ లు ప్రదర్శించడంపై మంత్రి రావెల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తన ప్రతిష్టకు భంగం కలిగించడానికి తన కొడుకును పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కావాలంటే తనను విమర్శించవచ్చని..తన శాఖ పనితీరుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ టివి ఛానెల్ లో ఎక్కడో ఫుటేజ్ చూపిస్తున్నారని, చట్ట వ్యవస్థపై పూర్తిగా తనకు నమ్మకం ఉందన్నారు. తన కుమారుడు నిర్ధోషి అని, కానీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
తన కుమారుడు అమాయకుడని, రాజకీయ కుట్రతోనే తన కుమారుడిపై కుట్రలకు దిగుతున్నారని కిశోర్ బాబు అన్నారు. ''నా కుమారున్ని లేనిపోని కేసుల్లో ఇరిగించాలని జగన్ ప్రయత్నిస్తున్నాడు'' అని ఆయన నేరుగా ఆరోపణలు చేశారు. మొదట ఎఫ్ ఐఆర్ లో తన కుమారుడి పేరు లేదని... కొందరు కుట్ర చేసి కుమారుడి పేరు చేర్పించారన్నారు. మరి కొడుకుపై నిర్భయ కేసు విషయంలో మంత్రి రావెల జగన్ పై నిందలు వేస్తుండడంతో వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.