Begin typing your search above and press return to search.
చూస్తుంటే ఢిల్లీలో దీక్ష చేయించేలా ఉన్నారే
By: Tupaki Desk | 8 Oct 2015 9:10 AM GMTప్రత్యేక హోదా విషయంలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీకి తగ్గట్లే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని.. కేంద్ర వైఖరితో ఏపీ నష్టపోతుందంటూ విపక్ష నేత జగన్ ఈ అంశంపై తరచూ నిరసనలకు దిగుతున్నారు. తాజాగా నల్లపాడులో దీక్ష నిర్వహిస్తున్న ఆయన వైఖరి.. ఏపీ అధికారపక్షానికి ఇబ్బందిగా మారింది.
ఏపీ ప్రజల్లో భావోద్వేగాలు పెంచే ఈ దీక్ష ఎక్కడ తమకు ఇబ్బందిగా మారుతుందన్న ఆందోళనలో ఉన్నారు. దీనివల్లే కాబోలు.. గత కొద్దిరోజులుగా జగన్ మీద చీటికి మాటికి విరుచుకుపడుతున్నారు. తాజాగా జగన్ చేస్తున్న దీక్షపై.. ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. జగన్ తన దీక్షలతో గుంటూరులో అలజడి సృష్టించాలని భావిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తం చేశారు.
శంకుస్థాపనకు వచ్చే అతిధుల్ని అడ్డుకోవాలని చూస్తున్నట్లుగా ఉందని చెప్పుకొచ్చారు. ఎప్పుడో 14 రోజుల తర్వాత వచ్చే శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ దీక్షకు లింకు పెట్టేస్తున్న రావెల.. జగన్ ను ఢిల్లీలో ఉద్యమం చేయాలని సవాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు దొరికి ఏకైన ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని ముందుకెళుతున్న జగన్.. ఢిల్లీలో కానీ దీక్ష చేస్తే.. ఏపీ అధికారపక్షానికి ఇబ్బందేనన్న విషయాన్న ఏపీ మంత్రి గుర్తించకపోవటం గమనార్హం. తమ మాటలతో రెచ్చగొట్టి మరీ.. జగన్ చేత ఢిల్లీలో దీక్ష చేయించేటట్లున్నారే..?